Kasthuri Shankar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. కానీ కొంతమంది మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు.. హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న కస్తూరి శంకర్ (Kasthuri Shankar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాగార్జున (Nagarjuna ) హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కస్తూరి శంకర్.. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలలో నటించింది.కానీ మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె తెలుగుతోపాటు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ఫుల్గా కెరియర్ లీడ్ చేస్తోంది.
రాత్రి 9:00 అయితే చాలు ఆగలేకపోతున్నాను..
ఇకపోతే కస్తూరి శంకర్ విషయానికి వస్తే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ.. వాటిల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. “ప్రతిరోజు రాత్రి 9 అయ్యిందంటే చాలు.. ఆగలేక పోతున్నాను. నాకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు మానుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. కానీ నావల్ల కావడం లేదు. ఇంతకీ ఏంటా అలవాటు అంటే రాత్రి 9:00 అయింది అంటే చాలు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా నా మనసు ఆగదు. ఏదో ఒక జంక్ ఫుడ్ ఖచ్చితంగా బయట నుంచి తెచ్చుకొని తింటే తప్ప నాకు నిద్ర పట్టదు. ఈ అలవాటు మంచిది కాదని తెలుసు. మానుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా నా వల్ల కావడం లేదు. నా జిమ్ ట్రైనర్ కూడా ఈ అలవాటు మానుకోవాలని ఎన్నో సార్లు చెప్పినా.. ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను” అంటూ తనకున్న వింత అలవాటు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
కస్తూరి శంకర్ కెరియర్..
కస్తూరీ శంకర్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సినీ నటిగా, టెలివిజన్ వ్యాఖ్యాతనా కూడా పేరు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాష చిత్రాలలో సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. మద్రాస్ లో ఉన్నత పాఠశాలలో ఉండగానే మోడలింగ్ ప్రారంభించిన ఈమె.. 1992లో మిస్ మద్రాస్ టైటిల్ గెలిచింది. చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. 1991లో ‘ఆతా ఉన్ కోయిలలే’ వంటి తమిళ చిత్రంతో కస్తూరి శంకర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఒక 2006లో డాక్టర్ రవికుమార్ ను వివాహం చేసుకున్న ఈ దంపతులకు.. ఒక కుమారుడు జన్మించారు. అలాగే ఒక కుమార్తె కూడా ఉంది. ఈమె కుమార్తె లుకేమియా కొన్ని సంవత్సరాల క్రితం బయటపడిన విషయం తెలిసిందే. ఈమె బ్యూటీ విత్ బ్రెయిన్ కూడా బిబిసి మాస్టర్ మైండ్ ఇండియా 2000 క్విజ్ లో ఫైనలిస్ట్ కూడా..
ALSO READ:Rashmi Gautam: ఎట్టకేలకు సర్జరీ పై ఓపెన్ అయిన రష్మీ.. ఇంత బాధ అనుభవించిందా.?