Kim Jong Un bans ponytails in latest despotic North Korean crackdown: చరిత్రలో నియంతలు అనగానే హిట్లర్, ముస్సోలినీ లు గుర్తుకొస్తారు. వారి వారసుడిగా ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు వినిపిస్తోంది. అయితే కిమ్ తో పోల్చుకుంటే హిట్లర్ వంటి నియంతల పేర్లు బలాదూరే.మరీ ప్రజల వేషభాషల విషయంలోనూ కిమ్ జోక్యం ఎక్కువయింది. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత విషయాలలో తలదూరుస్తూ మరోసారి వార్తలలోకి ఎక్కారు కిమ్. ఉత్తర కొరియాలో మహిళలు వయసుతో పనిలేకుండా పోనీటైయిల్ జుట్టుతో కనిపిస్తుంటారు. అమ్మాయిలంతా క్యాజువల్ గా ఆఫీసులకు, కాలేజీలకు వెళుతుంటారు. అయితే వారి పోనీ టెయిల్ విషయంలో కిమ్ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టారు. ఇకపై అక్కడి మహిళలెవరూ పోనీటెయిల్ వేసుకోకూడదని..తన నిబంధనలు ఎవరైనా మహిళలు అతిక్రమిస్తే వారి జుట్టు మొత్తం కత్తిరించి గుండు చేస్తామని సూచించారు. అంతేకాదు వారిని ఆరు మాసాల పాటు కారాగారంలో కూడా ఉంచాలని కిమ్ సూచించడం గమనార్హం.
మహిళల మండిపాటు
కిమ్ నిబంధనపై అక్కడి మహిళలు కిమ్ పై మండిపడుతున్నారు. గతంలోనూ లిప్ స్టిక్ వాడకంపై నిషేధం విధించిన కిమ్ ఈ సారి పోనీటైల్ జుట్టుపై నిబంధనలు అమలు చేయడంపై నార్త్ కొరియా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కిమ్ పై అసలు మహిళలు పోనీటైయిల్ తో కనిపించడంపై కిమ్ కి ఎందుకంత కోపమొచ్చిందంటే తన శత్రుదేశమైన దక్షిణ కొరియా మహిళలు పోనీటైయిల్ హెయిర్ స్టయిల్ తో వారి దేశంలో స్వేచ్ఛగా తిరుగుతుంటారు. అయితే తమ దేశంలో మహిళలు మాత్రం అలా ఎన్నటికీ కనపడకూడదనే సాకుతో కిమ్ కేవలం తన వ్యక్తిగత కోపంతో ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక పోనీ టెయిల్ హెయిర్ కట్ నిబంధనలే కాకుండా శరీరానికి అంటిపెట్టుకుని ఉండే డ్రెస్సులు వేసుకోకూడదని, ట్రాన్స్ పరెంట్ డ్రెస్సులు కూడా వేసుకోకూడదని కఠిన నిబంధనలు ప్రవేశ పెట్టారు. అలాగే శరీరానికి అంటిపెట్టుకుని ఉండే జీన్స్ ఫ్యాంట్లు, మిడ్డీలు వేసుకోకూడదనే కఠిన నిబంధనలతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కిమ్ పై.
కిమ్ మరో సంచలన నిర్ణయం
ఇదిలా ఉండగా కిమ్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉత్తర కొరియాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. వర్షాలు, వరదలతో నార్త్ కొరియా అతలాకుతలమైపోయింది. అయితే ప్రకృతి సృష్టించిన భీభత్సానికి ఏకంగా నాలుగు వేల మంది అక్కడ మృతి చెందారు.అధికారుల నిర్లక్ష్యంతోనే ఇంతటి ప్రాణ నష్టం ఏర్పడిందని 30 మంది అధికారులపై వేటు వేశారు. వేటు వేయడమే కాదు..వారికి మరణశిక్ష కూడా విధించారు. దీనిపై పలు జాతీయ మీడియాలలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆ దేశంలోనే కాదు..ఇతర దేశస్థులు, పలు అంతర్జాతీయ సంస్థలు కిమ్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి ముక్త కంఠంతో. అయినా కిమ్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఏ అధికారి అయినా నిర్లక్ష్యంతో పనిచేసే ఆలోచన మానుకుంటారని..దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తారని కిమ్ చెబుతున్నారు. ఇది మాత్రం దుర్మార్గమైన చర్యగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.