BigTV English

Heavy Rains: బిగ్ అలర్ట్.. ఇవాళే మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం

Heavy Rains: బిగ్ అలర్ట్.. ఇవాళే మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం

Another Low-pressure Area in Bay Of Bengal: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడం వాయిగండంగా మారి విజయవాడను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇంకా తేరుకోకముందే మళ్లీ మరో అల్ప పీడనం ఏర్పడనుంది. బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అల్పపీడనంగా మారనుంది వాతావరణ శాఖ హెచ్చరించింది.


రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతువపన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈనెల 9 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ ప్రభావంతో విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపింది. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఇప్పటికే కురిసిన వర్షాలకు అల్లాడిపోతున్న విజయవాడను వర్షం వీడట్లేదు. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో నగరవాసులు వణికిపోతున్నారు.

Also Read: మరోసారి బుడమేరు డేంజర్ బెల్స్ మోగిస్తోంది

ఇదిలా ఉండగా, బుధవారం తూర్పుగోదావరి, కాకినాడ, వైఎస్సార్, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కర్నూల్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

Related News

Srikakulam News: లవ్ మ్యారేజీకి ఒప్పుకోవడం లేదని.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్.. చివరకు?

YSR CSO John Wesley: కొడుకు వర్ధంతి.. తల్లి అదే రోజు మృతి.. ఈ ఫ్యామిలీకి జగన్ కు సంబంధమేంటి?

Nellore Politics: కాకాణితో భేటీ.. నెల్లూరు నగర మేయర్ స్రవంతికి పదవీగండం

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Lokesh vs Jagan: ఓరి నీ పాసుల గోల.. జగన్‌పై లోకేష్ సెటైర్లు, మేటరేంటి?

Big Stories

×