E-Paper
Advertisement

యూడైస్ ప్లస్ లెక్కలతో బట్టబయలైన డొల్లతనం.. కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్!

యూడైస్ ప్లస్ లెక్కలతో బట్టబయలైన డొల్లతనం.. కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్!
Advertisement

AP School Education: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యా రంగంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోతున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ ప్లస్ గణాంకాలను ఉటంకిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల

జగన్ ఫైర్..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని ప్రచారం చేసుకోవడంపై జగన్ మండిపడ్డారు. ఇది వాస్తవమైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? అని ప్రశ్నించారు.

విద్యార్థుల సంఖ్య..

Advertisement

యూడైస్ గణాంకాల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే, 2025-26 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయిందని, అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా 45 వేల నుంచి 44,222కు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: చిన్న ఫ్యామిలీ, ఆఫీసులకు పర్ఫెక్ట్.. తక్కువ ధరలో బెస్ట్ మోడల్

అనుమానం వ్యక్తం..

Advertisement

టీడీపీకి నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలతో ఉన్న సంబంధాల కారణంగానే, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారు. తద్వారా ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం బాటలు వేస్తోందని అనుమానం వ్యక్తం తమ హయాంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని జగన్ గుర్తుచేశారు.

ప్రభుత్వ విద్యారంగం..

మనబడి నాడు-నేడు’ కింద రూ.8,524 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని, విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ టోఫెల్ వంటి అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సైతం శ్రీకారం చుట్టామని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలో పయనిస్తుండటం ఆందోళనకరమన్న జగన్ ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనాన్ని ఈ లెక్కలే బయటపెడుతున్నాయి.

Also Read: ఈ డిగ్రీలు చదివితే ఉద్యోగాలు లేవు.. నీతిఆయోగ్ రిపోర్ట్

Tags

Related News

తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, జంతు కొవ్వు లేదన్న విజయసాయి రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

మోదీ 25 ఏళ్ల పాలన పై వైఎస్ షర్మిల సెటైర్లు.. ఏమన్నారంటే?

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?

నారా నట సామ్రాట్ చంద్రబాబు.. నా అల్లుడి కంటే గొప్ప నటుడు: రోజా పంచ్‌లు!

బ్రహ్మోత్సవాల సీజన్.. తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఈ విధంగా

నిర్మాణం ఓకే.. కానీ రిస్క్ మీదే! విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సంచలన తీర్పు

Big Stories

Advertisement
×