E-Paper
Advertisement

జోగి రమేష్ చిలక పలుకులు.. ఫ్యామిలీ మేటర్‌ని రాజకీయం చేయొద్దు, ప్లీజ్ అంటూ

జోగి రమేష్ చిలక పలుకులు.. ఫ్యామిలీ మేటర్‌ని రాజకీయం చేయొద్దు, ప్లీజ్ అంటూ
Advertisement

Jogi Ramesh: ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై నోరు విప్పారు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్. ఇదంగా ప్రత్యర్థులు పన్నిన కుట్రగా వర్ణించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. కుటుంబంలో బేధాభిప్రాయాలు సహజంగా ఉంటాయని తేల్చేశారు. ఈ వ్యవహారం వెనుక టీడీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఉన్నారని చెప్పకనే చెప్పారు. అసలు ఏం జరిగింది?

 

ఫ్యామిలీలో కలహాలపై నోరు విప్పిన జోగి రమేష్

Advertisement

తన ఫ్యామిలీలో అంతర్గత కలహాలపై నోరు విప్పారు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్. కుటుంబంలో బేధాభిప్రాయాలు సహజంగా ఉంటాయన్నారు. నా కుటుంబ వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దని కోరారు. పిల్లలు బాగుండాలని కోరుకోవడం తల్లిదండ్రులు బాధ్యత అని గుర్తు చేశారు. కోడలు మేఘన తనకు కూతురుతో సమానమని గుర్తు చేశారు.

రాజీవ్-మేఘన మధ్య ఉన్న చిన్న చిన్న విబేధాలున్నా రెండు కుటుంబాలు బాగానే ఉన్నాయని వివరించారు. సోమవారం మీడియా ముందుకొచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకొని కొందరి మానసిక హింసకు గురి చేశారని ఆరోపించారు. ఇంకొందరు వ్యాపారం చేసుకున్నారని కొత్త విషయాలు బయపెట్టారు.

Advertisement

 

ఫ్యామిలీ మేటర్‌ని రాజకీయం చేయొద్దు-జోగి రమేష్

డైవర్స్ కోసం రాజీవ్.. ఈ ఏడాది జూన్ 8న పిటిషన్ దాఖలు చేశాడని, మరుసటి నెల జూలై 24న మా కుటుంబంపై మేఘన కంప్లైంట్ చేసిందన్నారు. నా భార్య బైబుల్ చదివితే తప్పా? ఏసు క్రీస్తు బోధనలు వింటే తప్పా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. శ్రీశైలం, బెజవాడ, తిరుమలకు కుటుంబంతో సహా అందరూ వెళ్ళామని చెప్పే ప్రయత్నం చేశారు.

ITDP ముసుగులో మా కుటుంబంపై బురద చల్లుతున్నారని, మా కుటుంబంపై చంద్రబాబు-లోకేష్ కక్ష కట్టి దారుణంగా చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకొని కొందరి మానసిక హింసకు గురి చేశారని ఆరోపించారు. ఇంకొందరు వ్యాపారం చేసుకున్నారని కొత్త విషయాలు బయపెట్టారు. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని, మేఘనా నా కూతురుతో సమానమని అన్నారు.

 

కొడుకు-కోడలు కలిసి ఉండాలి, అదే నా కోరిక-జోగి

మళ్ళీ రాజీవ్-మేఘనలు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కుటుంబం వ్యవహారంపై విమర్శలు చేయలేదని, నాకు మనస్సాక్షి ఉంది కాబట్టే అన్ని వెల్లడించలేదన్నారు. మా కుటుంబం వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చి వైసీపీ-జగన్‌పై ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జోగి రమేష్ ఎప్పుడూ తప్పు చెయ్యరని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో ఫ్యామిలీ మేటర్‌లోకి స్థానిక ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ను లాగారు. మేఘన కుటుంబసభ్యులు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కార్యాలయంలో కలిసి బయటకు వస్తున్న వీడియోలు ఈ సందర్భంగా విడుదల చేశారు జోగి రమేశ్. మా కుటుంబం వ్యవహారంలో కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌కు నమస్కరించి చెప్తున్నానని, ఇలాంటి తప్పుడు పనులు మానుకోవాలన్నారు.

ALSO READ: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయాలకు పదును.. వైసీపీని టచ్ చేస్తూ, లవ్ జీహాద్ అంటూ..

Related News

ఆపరేషన్ ఫైర్‌వాల్.. విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల!

ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. ఏపీ అభివృద్ధిపై చర్చ

తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసింది నువ్వు కాదా జగన్?: వర్ల రామయ్య ఫైర్

పిడుగురాళ్లలో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళను నరికి చంపిన సైకో!

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, జంతు కొవ్వు లేదన్న విజయసాయి రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?

Big Stories

Advertisement
×