E-Paper
Advertisement

కాకినాడలో చితక్కొట్టుకున్న ఆంధ్ర, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలు.. ఏపీ సీఎంకు మణిపూర్ సీఎం విజ్ఞప్తి

కాకినాడలో చితక్కొట్టుకున్న ఆంధ్ర, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలు.. ఏపీ సీఎంకు మణిపూర్ సీఎం విజ్ఞప్తి
Advertisement

Kakinada: కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్‌ కాలేజీలో విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అది కాస్త తీవ్రరూపం దాల్చింది. విద్యార్థునులు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఈశాన్య విద్యార్థినులు వర్సెస్ స్థానిక విద్యార్థినులు ఘర్షణకు దిగారు. కొట్టుకోవడమేకాదు, కర్రలు, చెప్పులు బకెట్లు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టి వెళ్లింది.

 

చిచ్చురేపిన సెల్‌ఫోన్.. విద్యార్థినుల మధ్య ఫైటింగ్

Advertisement

కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్‌ కాలేజీలో సెల్‌ఫోన్ వ్యవహారం విద్యార్థినుల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. నర్సింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్-మణిపూర్‌కు చెందిన విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇటీవల కళాశాల హాస్టల్‌లో మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో సదరు విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఫోన్ దొరికింది. ఈ విషయం విద్యార్థినుల మధ్య వివాదానికి దారి తీసింది. ఘటన జరిగిన నుంచి విద్యార్థినుల మధ్య మాటామాటా పెరిగింది.

 

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల మధ్య ఫైటింగ్

Advertisement

శనివారం నాటికి అది కాస్త తీవ్రరూపం దాల్చింది. దీంతో ఈశాన్య-ఏపీ విద్యార్థినులు రెండు వర్గాలుగా చీలిపోయారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థినులు రోడ్డుపై ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడినవారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్. టకాలేజీ నిర్వాహకులు కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థినులకు నచ్చజెప్పడంతో వివాదం కాస్త ప్రస్తుతానికి సద్దు మణిగింది.

 

సీఎం చంద్రబాబు జోక్యం,  విద్యార్థినులను మరొక కాలేజీకి తరలింపు

ఇరు వర్గాల విద్యార్థినులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్తతలు పెరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 31 మంది విద్యార్థినుల అంగీకారంతో వారిని ప్రత్యేక హాస్టల్‌కు తరలించారు. ఈ ఘటన వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. విద్యార్థుల భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని, వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

ALSO READ: ఉపరితల ఆవర్తన ద్రోణి.. ఏపీ-తెలంగాణల్లోని వర్ష సూచన

మరోవైపు ఘటన గురించి తెలియగానే మణిపూర్ మాజీ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. విద్యార్థినులను సురక్షిత భవనానికి తరలించారని, రాత్రి వేళ భద్రత కోసం ఓ మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌ను నియమించినట్టు తెలిపారు. ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

Related News

తల్లిని, చెల్లిని రోడ్డు పాలు చేసింది నువ్వు కాదా జగన్?: వర్ల రామయ్య ఫైర్

పిడుగురాళ్లలో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళను నరికి చంపిన సైకో!

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, జంతు కొవ్వు లేదన్న విజయసాయి రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

మోదీ 25 ఏళ్ల పాలన పై వైఎస్ షర్మిల సెటైర్లు.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×