BigTV English

CM Chandrababu says: డెవిల్‌ కంట్రోల్.. ఆ రెండింటితో సంతోషమే, మీడియాతో సీఎం చంద్రబాబు..

CM Chandrababu says: డెవిల్‌ కంట్రోల్.. ఆ రెండింటితో సంతోషమే, మీడియాతో సీఎం చంద్రబాబు..

Nara Chandrababu latest news(Political news in AP): ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన టార్గెట్‌గా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. మెల్లమెల్లగా నిర్మాణం చేస్తామని చెప్పుకొచ్చారు. మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారాయన. ఈ సందర్భంగా కీలక ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు.


కేంద్రంలో కీలకంగా ఉండి మంత్రి పదవులు ఎందుకు తీసుకోలేదన్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు ముఖ్య మంత్రి. తాము కేంద్రంలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నామని, ఏనాడూ పదవులను కోరుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. మాకు పదవులు కావాలని కోరలేదని, వారు ఇచ్చిన రెండు పదవులు తీసుకున్నామన్నారు. ఈ రెండింటింతో సంతోషంగా ఉన్నామని, ఈ విషయంలో మీడియాకే బాధగా ఉందంటూ లైట్‌గా నవ్వుతూ అన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని, ఈ విషయంలో భయంలేదని చెప్పామని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. డెవిల్‌ను నియంత్రిస్తామని, ఈ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ఇప్పుడు పెట్టుబడుదారులకు ద్వారాలు తెరిచామని, త్వరలో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు తప్పనిసరిగా హాజరవుతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.


దక్షిణాలో ఏ రాష్ట్రానికీ లేని వనరులు ఏపీకి సొంతమన్నారు ముఖ్యమంత్రి. ఏపీ ద్వారా ముఖ్యమైన నదులు ప్రవహిస్తున్నాయని, మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చుకోవచ్చన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాన్ని కేంద్రమే చూసుకుంటుంద న్నారు.

ALSO READ:  పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి

త్వరలో అమరావతికి 135 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయన్నారు. ముఖ్యంగా రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల నిర్మాణాన్ని తాము పూర్తి చేస్తామన్నారు. మొత్తానికి కేంద్రం నుంచి మాకు అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×