BigTV English

IND-W vs SA-W 1st T20: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

IND-W vs SA-W 1st T20: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

South Africa Women beat India Women by 12 runs: దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 12 పరుగులతో తేడాతో గెలుపొందింది.


తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇందులో టాజ్మిన్ బ్రిట్స్(81; 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మరిజేన్ కాప్(57; 33 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్), లారా వోల్వార్డ్ 33 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో పూజ, రాధ చెరో రెండు వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా విధించిన 190 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ మెరుపులా ఆరంభించింది. అయితే తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కీలక వికెట్లు కోల్పోయింది. షెఫాలివర్మ(18 ), స్మృతి(46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే తర్వాత 9 ఓవర్లకే 87 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(35; 29 బంతుల్లో ఐదు ఫోర్లు), జెమీమా(53) పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. చివరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి ఉండగా.. హర్మన్ ప్రీత్ కౌర్ ఔట్ కావడంతో కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భార్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖకా, డిక్లెర్క్, ఎంలబా, ట్రయాన్ తలో వికెట్ తీశారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×