అయితే, తమ పార్టీ సోషల్ మీడియా కేడర్‌ను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ ట్వీట్‌తో ముందుకొచ్చారు. ప్రజాస్వామ్య సూత్రాలను, మానవహక్కులను కాలరాసి మరీ సోషల్‌మీడియా యాక్టివిస్టులను భయకంపితులను చేస్తున్న, దారుణంగా హింసిస్తున్న అత్యంత క్రూరమైన ప్రభుత్వంతో పోరాడుతున్నామని ట్వీట్ చేశారు. ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ అనైతిక యుద్ధంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో నిజం పక్షాన నిలబడిన ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు YCPకి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా దన్నుగా నిలబడ్డ నటి శ్రీరెడ్డి కాళ్ల బేరానికి వచ్చారు. YCP సానుభూతిపరురాలిగా ఉన్న శ్రీరెడ్డి.. TDP, జనసేనలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లనే కాకుండా.. వారి కుటుంబాలను కూడా రోడ్డుకు ఈడ్చి.. మహిళలను కూడా ఇష్టానుసారంగా అవమానపరిచే శ్రీరెడ్డి.. తాజాగా దిగి వచ్చింది.
Also Read: రాత్రి గంటసేపు భేటీ, తవ్వేకొద్దీ బయటపడుతున్న వైసీపీ సోషల్ కాలకేయుల చిట్టా.. మరో 500 మంది?
ఉన్నఫలంగా అంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి దిగిరావడం ఏంటి? అనే అనుమానాలకు ఇటీవల ప్రభుత్వం శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్ చేయడమే అనే సమాధానాలు లభిస్తున్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టులకు లైకులు, షేర్లు చేసిన సభ్యులపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ చర్యలతో ఇక శ్రీరెడ్డికి మూడిందన్న వాదన వినిపించింది. దీంతో శ్రీరెడ్డి దిగివచ్చి బుద్ధొచ్చింది.. క్షమించండి.. ఇకపై బుద్ధిగా ఉంటా! అంటూ.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, ప్రస్తుత ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలను ఉద్దేశించి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.
తన కుటుంబాన్ని, తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీరెడ్డి పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తన వల్ల తన ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు శ్రీరెడ్డి. ఇక తన నుంచి తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదని పేర్కొనడం గమనార్హం. అంతే కాదు తనతోపాటు తన కార్యకర్తలు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను వదిలేయాలని కూడా కోరారు. ఇక, నుంచి తాము జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనించదగ్గ విషయం. ఇక తమ సోషల్ మీడియా కేడర్ లో ధైర్యం నింపేలా మాజీ సీఎం జగన్ ట్వీట్లు వేసినప్పటికీ.. శ్రీరెడ్డి ఇలా క్షమాపణలకు దిగిరావడంతో వైసీపీ సోషల్ మీడియాలో వణుకు మామూలుగా లేదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మరి శ్రీరెడ్డి క్షమాపణలపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.