Intinti Ramayanam Today Episode November 9th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… దీపావళికి అందరు సంబరాలు చేసుకుంటుంటే వినోద్ వస్తాడు. అక్కడకు రాగానే కోమలి చేసిన పని గురించి అందరి చెబుతాడు. ఇక విడాకులు పంపిస్తాను సైన్ చేయించండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లోకి వెళ్తారు. నీ అనుమానంతో మనుషులకు చిరాకు తెప్పించకు అని మొదటి నుంచి చెబుతున్నా నువ్వు వినలేదు అని పార్వతి తిడుతుంది.. పండుగ పూట ఇలా జరగడం బాధగా ఉందని పల్లవి అంటుంది. ఇంట్లో అందరు ఫీల్ అవుతారు. పల్లవి మాత్రం ఫుల్ ఖుషి అవుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అక్కడకు వస్తాడు. ఏంటి బాంబులు కాల్చేశారా? లేదా నా కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతాడు. కాదు మామయ్య అని పల్లవి జరిగిన విషయం చెబుతుంది. వినోదు కోమలిని వదిలేసి వెళ్లాడని చెప్పగానే రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. మొదటినుంచి నీకు చెబుతూనే ఉన్నాను మొగుడు మీద ఇంత అనుమానం పనికిరాదు అని ఆయన నువ్వు వినలేదు ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకున్నావని రాజేంద్రప్రసాద్ కూడా కోమలేని తిడతాడు. ఇక అక్షయ్ మీరంటే బావకి గౌరవం ఉంది మీరు ఒకసారి ఫోన్ చేసి అడగండి అని చెబుతాడు. రాజేంద్రప్రసాద్ వినోద్ కు ఫోన్ చేస్తే మీ అమ్మాయి తో నేను విసుగపోయాను నన్ను క్షమించండి అనేసి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కోమలి ఆ మాట విని షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. వినోద్ వెళ్లిపోవడం పై పొద్దున్నే కోమలి బాధ పడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క మాట అంటారు. నాదేమీ అనుమానం కాదు ముందు జాగ్రత్త అని కోమలి అప్పటికి తన తప్పని ఒప్పుకోకుండా చెప్తుంది. నన్ను అనడం కాదు అందరు అంటే ఎలా అని ఏడుస్తుంది. అక్షయ్ కూడా కోమలి మీద సీరియస్ అవుతాడు. ఇంట్లో ఎవరు వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడడానికైనా ఉంటుంది కదా అని అంటారు కానీ వినోద్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక అవని అక్షయ్ ని పక్కకు రమ్మని పిలుస్తుంది. ఏవండీ ఇలా ఫోన్లతో మాట్లాడితే పని జరగదు మనిషితో నేరుగా మాట్లాడి చెప్పే విధానంలో చెప్తే వింటాడు మనం వెళ్దాం రండి నేను చెప్తాను అనేసి అంటుంది. ఇక పల్లవి ఇంట్లో కనిపించదు. ఎక్కడికి పోయిందో అని అనుకుంటారు. ఇక పల్లవి ఇక తనకు అబార్షన్ చేస్తున్న డాక్టర్ తో ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా హాస్పిటల్ కి వెళుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేసిన డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అప్పుడే డాక్టర్ దగ్గరికి పల్లవి ఎంట్రీ అయ్యి ఎందుకు నా ఫోన్ మీరు కట్ చేస్తున్నారు అసలు నాకు అబార్షన్ చేశారా లేదా అని నిలదీస్తుంది. అవని చెప్పడం వల్ల నీకు అబార్షన్ చేయలేదని డాక్టర్ నిజం చెబుతుంది.
నా ప్రెగ్నెన్సీ గురించి మా నాన్నకు నాకు నీకు తప్ప అవినీకు ఎలా తెలిసింది అసలు అవని ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఆ పల్లవి డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు సిస్టర్ వచ్చి వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు అందుకే ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది. దానికి సీరియస్ అయిన పల్లవి మీ హాస్పిటల్ లో అందరూ అబద్ధాలు చెప్తారని సీరియస్ అవుతుంది. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారని సిస్టర్ అనగానే పల్లవి వాళ్ళ అమ్మను చూపిస్తారా అని అడుగుతుంది. ఆవిడే వాళ్ళ అమ్మగారు అని సిస్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. నేను యాక్సిడెంట్ చేసిన ఆవిడ అవనికి అమ్మ అని పల్లవి ఆలోచిస్తుంది. భరత్ బాగున్నావా అని లోపలికి వెళ్తుంది. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది నేనే గుర్తొచ్చానా అని అనగానే భరత్ గుర్తుపట్టానండి అని అంటాడు. ఇక అవని గురించి తెలుసుకుందాం అని పల్లవి గుచ్చి గుచ్చి అడుగుతుంది.
మీనాక్షి చెప్పడంతో భారత్ అవని గురించి చెప్పడం మానేస్తాడు. ఇక ఇంట్లో అందరు పల్లవి కోసం టెన్షన్ పడతారు. రాజేశ్వరి, చక్రధర్ లు ఇంటికి వస్తారు. పల్లవి ఎక్కడికి వెళ్లిందో అని టెన్షన్ పడతారు.. కమల్ ను రాజేంద్ర ప్రసాద్ తిడతాడు. అప్పుడే పల్లవి అక్కడికొస్తుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. పల్లవి మౌనంగా ఉంటుంది. ఇక చక్రధర్ పల్లవికి సపోర్ట్ చేస్తాడు. వాకింగ్ కి వెళ్తున్నాను నాకు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు ఎందుకు నా కూతుర్ని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కనీసం వాకింగ్ చేయడానికి కూడా స్వతంత్రం లేదా అని నిలదీస్తాడు. దానికి రాజేంద్రప్రసాద్ ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది కదా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారని అంటాడు. ఇక అవని వినోద్ దగ్గరికి వెళుతుంది. కోమలి గురించి అయితే నా దగ్గర మాట్లాడొద్దు అని అంటాడు. నా జీవితం ఇలా అవడానికి కోమలినే కారణం తన అనుమానమే కారణమని చెప్తాడు. అంతలోకి నిన్న కోమలి కొట్టిన మేడం ఫోన్ చేస్తుంది. మనం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత తీసుకోండి ప్రాజెక్ట్ అయితే బాగుండాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అవని పురాణాల గురించి వినోద్ కి చెప్తుంది. కోమలి తప్పు చేసింది అని అనుకోవడం కాదు ఆ తప్పు చేయడానికి కారణమైన నువ్వు మారాలి. నీ భార్య నువ్వు మార్చుకోవాలని చెప్తుంది. ఆ సుధా మేడంకి మీ బావని చెప్పాడు ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంతోనే నీకు ఫోన్ చేసిందని అవని చెప్తుంది. ఇక అవినీ చెప్పిన పురాణాలకాలతో అక్షయ చేసిన పనికి వినోద్ కరిగిపోయినట్టే కనిపిస్తున్నాడు.
పల్లవి చక్రధర్ మాట్లాడుకుంటుంటారు. నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న విషయం డాక్టర్ ఏం చెప్పింది ఎందుకు నీకు అబార్షన్ చేయలేదని చెప్పిందని అడుగుతాడు. దానికి కారణం అవని అని చెప్పింది అవని ఇన్ని రోజులు అనాధ అనుకున్నాం కానీ అది అనాధ కాదు దానికి ఒక అమ్మ తమ్ముడు ఉన్నారు అని పల్లవి చెప్తుంది. నాదాన్ని అందరూ ఇంట్లో వాళ్ళు వెనకేసుకొని ఈ విషయం తెలిస్తే అందరూ షాక్ అవుతారని పల్లవి అంటుంది.. ఇక కోమలి వినోద్ కలవడంతో అందరు గుడికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం పల్లవి ప్లాన్ లో భరత్ బలి అవుతాడు. ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..