OTT Movie: ‘అజంత’ అంటే మనకు వెంటనే గుర్తుకువచ్చేది అక్కడి ఆలయాలపై ఉండే శృంగార భంగిమల శిల్పాలే. అందుకే కొత్తగా పెళ్లయినవారు అక్కడికి వెళ్తుంటారు. అయితే, అజంత శిల్పాల గురించి ప్రత్యేకంగా ఎలాంటి సినిమా తెరకెక్కలేదు. కానీ, కొన్ని సినిమాల్లో వాటిని రిఫరెన్స్‌గా తీసుకున్నారు. 2012లో నితిన్ చంద్రకాంత్ దేశాయ్ దర్శకత్వంలోసినిమా ‘అజంత’ (Ajintha) అనే మరాఠీ మూవీ తెరకెక్కింది. అయితే, అది ‘అజంత’ హిస్టరీకి సంబంధించినది కాదు. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. 18వ దశాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను తెరకెక్కించిన తీరు కూడా చాలా బాగుంటుంది. చాలా కళాత్మకంగా ఉంటుంది. మరి, ఈ మూవీ కథ ఏమిటంటే?
ఈ చిత్రం 18వ శతాబ్దంలోని అజంతా గుహల చారిత్రక నేపథ్యంతో మూవీ స్టార్ట్ అవుతుంది. 1819లో బ్రిటీష్ పాలకులు అజంతా గుహలను కనుగొంటారు. ఒక బ్రిటిష్ కళాకారుడు, సైనికుడు మేజర్ రాబర్ట్ గిల్ (ఫిలిప్ స్కాట్ వాలెస్)కు ఆ గుహలలోని కళాఖండాలను పునర్నిర్మించే బాధ్యతను తీసుకుంటాడు. ఈ పని కోసం అతను లేనాపూర్ గ్రామంలో స్థిరపడతాడు. అక్కడ అతను పారో (సోనాలీ కులకర్ణి) అనే స్థానిక ఆదివాసీ అమ్మాయిని కలుస్తాడు. పారో గుహల గురించి సమాచారం అందించడంలో రాబర్ట్‌కు సహాయం చేస్తుంది. ఆమె అమాయకత్వం అతన్ని ఆకర్షిస్తుంది. పారో.. అతడికి గుహలలోని చిత్రాలను అర్థం చేసుకోడానికి సహాయం చేస్తుంది.
పారో అతడి కళాత్మక ఆలోచనలు చూసి ఫిదా అవుతుంది. అయితే, ఇద్దరికి భాషా సమస్యలు వస్తాయి. పారో స్థానిక భాషలో మాట్లాడుతుంది. రాబర్ట్ ఇంగ్లీషులో మాట్లాడతాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి గుహలను అన్వేషిస్తూ, కళ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పారో సహజమైన అందం, ఆమె జీవన విధానాన్ని చూసి రాబర్ట్ ప్రేమలో పడతాడు.
అప్పటివరకు వారి ప్రేమకథ ఒక అందమైన కావ్యంలా సాగుతుంది. కానీ.. సామాజిక, సాంస్కృతిక అడ్డంకులు వారి ప్రేమకు విఘాతం కలిగిస్తాయి. వారి ప్రేమను పారో పెద్దలు అంగీకరించారు. అక్కడి నుంచే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు గుండెను బరువెక్కిస్తాయి. కన్నీళ్లు వస్తాయి. మీకు ప్రేమ కథలు ఇష్టమైతే చూడండి. ప్రస్తుతం ఈ మూవీ Amazon Prime Video ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఒంటరిగా చూడండి.