BigTV English
Advertisement

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

జగన్ ఏంటి, అసెంబ్లీకి వెళ్లడమేంటి అనుకుంటున్నారా? కానీ ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. వైసీపీ తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్లలో జగన్ అసెంబ్లీ వీడియోలను పోస్ట్ చేసింది. ఎలాగూ తమ అధినేత అసెంబ్లీకి వెళ్లడం లేదు కదా, ఇలాగైనా కేడర్ ని సంతృప్తి పరచుదామని అనుకున్నట్టుంది. అందుకే జగన్ అప్పట్లో అసెంబ్లీలో ఎలా మాట్లాడారో తెలిసేలో ఓ వీడియో పోస్ట్ చేసింది.


అసెంబ్లీలో సినిమా..
సాగునీటి విధానం, ప్రాజెక్ట్ లపై వైసీపీ ప్రభుత్వం ఎంత అలసత్వంగా వ్యవహరించిందో వివరిస్తూ తాజాగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో జగన్ & కో సినిమా… అంటూ వ్యాఖ్యానం జతచేసి చంద్రబాబు వీడియోని టీడీపీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వైసీపీకి సాగునీటిపై విధానం లేదని, వారికి ఉందల్లా విధ్వంసమేనని టీడీపీ విమర్శించింది. “పట్టిసీమ దండగ.. డేట్లు మార్చి, పోలవరం ఫేట్ మార్చేసిన వైనం, పర్సంటా-అర పర్సంటా అంటూ వెకిలి వ్యాఖ్యలు, కుప్పం నీళ్ళ సినిమా సెట్టింగ్, ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా జాతికి అంకితం ఇచ్చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూడండి”. అంటూ ఆ వీడియోలో జగన్, అనిల్, అంబటి.. వ్యాఖ్యల్ని సభలో చూపించారు చంద్రబాబు.

గడచిన 5 ఏళ్ళలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను అప్పటి వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వారి నిర్వాకంతో రాష్ట్రంలోని 1008 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో.. 613 పనిచేయట్లేదని చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టుల మరమ్మతులు కూడా జరగలేదని, వాటిని మళ్ళీ ఉపయోగంలోకి తేవాలంటే రూ.725 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. వెంటనే ఆ నిధులు విడుదల చేసి, ఈ ఏడాది చివరకి అవన్నీ పని చేసేలా చేస్తామని మాటిచ్చారు.

వైసీపీ ఎదురుదాడి..
అసెంబ్లీలో చంద్రబాబు చూపించిన వీడియోతో వైసీపీ పరువుపోయినట్టయింది. దీంతో వెంటనే ఆ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అప్పట్లో జగన్ అసెంబ్లీలో ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్ ని మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వైసీపీ. వాస్తవాలేంటో టీడీపీ నేతలు తెలుసుకోవాలంటూ ఆ వీడియోని పోస్ట్ చేశారు.

పోలవరం విషయంలో..
మిగతా ప్రాజెక్ట్ ల సంగతి ఎలా ఉన్నా.. పోలవరం విషయంలో వైసీపీ పదే పదే ఎదురుదెబ్బలు తిన్నది. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామంటూ అప్పటి నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ సభలో ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ టార్గెట్ 2022కి మారింది, ఓసారి జగన్ 2023 అన్నారు, మళ్లీ 2025కి మార్చారు. ఇక అనిల్ తర్వాత నీటిపారుదల శాఖకు మంత్రిగా వచ్చిన అంబటి రాంబాబు.. పోలవరంపై చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో అందరికీ తెలుసు. పోలవరం అర్థమయ్యే సబ్జెక్ట్ కాదని, అది తనకు కూడా అర్థం కాలేదని అన్నారాయన. దీంతో పోలవరం విషయంలో వైసీపీ ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుందో స్పష్టమైంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఇదే విషయంపై వైసీపీని ఇరుకున పెట్టారు సీఎం చంద్రబాబు.

Related News

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Pawan Kalyan: రోడ్లపై నిర్లక్ష్యం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్!

Jagan Tour: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

Big Stories

×