Nindu Noorella Saavasam Serial Today Episode: మేజర్ ఇంట్లో అందరూ పార్టీ మూడ్‌లో ఉంటారు. ఇంతలో బయట మనోహరి పంపించిన రౌడీలు వస్తారు. కారు దిగి మనోహరికి కాల్ చేస్తారు. మనోహరి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు నాగు అని అడుగుతుంది. నాగు మేడం మీరు చెప్పిన ప్లేస్‌కే వచ్చాము లోపలికి వెళ్లి వేసేయమంటారా..? అని అడుగుతాడు. దీంతో మనోహరి కంగారుగా రేయ్ అది మిలటరీ వాళ్ల పార్టీరా.. మీరు లోపలికి వెళ్లితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పరేస్తారు. చూడండి వాళ్లు వచ్చే వరకు మీరు బయటే వెయిట్ చేయండి. వచ్చాక వేసేయండి. గుర్తు ఉంది కదా వాళ్లల్లో ఒక్కరినే వేసేయాలి అని చెప్తుంది. ఓకే మేడం గుర్తుంది వాళ్లు బయటకు రాగానే ఫోన్ చేస్తాను.వేసేయడానికి కన్ఫం చేయండి మేడం అంటాడు సరే అంటూ మనోహరి కాల్ కట్ చేస్తుంది.
మరోవైపు పార్టీలో మిస్సమ్మను దూరం నుంచి చూస్తున్న అమర్ తిన్నావా..? అని అడుగుతాడు. తిన్నానని సైగ చేస్తుంది మిస్సమ్మ. అక్కడే ఉన్న మేజర్ వైఫ్ ఇంకేంటి భాగీ విశేషాలు.. మాకు నువ్వు ఇప్పుడు పరిచయం కానీ అరుంధతితో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అమరేంద్ర అరుందతిని ఎంతో అపురూపంగా చూసుకునే వారు యువర్ వెరీ లక్కీ.. అంటుంది. దీంతో మిస్సమ్మ ఆయన నన్ను అంతకంటే బాగా చూసుకుంటున్నారు మేడం.. నన్ను కాలు కింద పెట్టనివ్వరు తెలుసా..? అని చెప్పగానే.. ఓ అవునా..? రియల్లీ అంటుంది మేజర్ వైప్. నన్ను ఏ పనులు చేయనివ్వరు ఇంట్లో అన్ని పనులు ఆయనే చేస్తారు. ఎప్పుడూ భాగీ భాగీ అంటూ నా వెనకే తిరుగుతుంటారు. నేను లేకపోతే ఆయనకు క్షణం కూడా ఏమీ తోచదు తెలుసా..? అని చెప్పగానే.. ఏయ్ రియల్లీ యువర్ లక్కీ యార్ అంటుంది మేజర్ వైఫ్.
అంతెందుకు ఈ పార్టీకి నేను కచ్చితంగా రావాలని చెప్పారు.. నేను రాను రాను ఇంట్లో పిల్లలను చూసుకోవాలని ఎంత చెప్పినా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. వచ్చి తీరాల్సిందే అని బతిమిలాడేశారు. ఫ్లీజ్ రావా ఫ్లీజ్ రావా అంటూ బలవంతం చేశారు అనుకోండి. ఆయన అంతలా బతిమాలేసరికి కాదనలేక వస్తాను అన్నాను. కానీ పార్టీకి కట్టుకోవడానికి కొత్త శారీ లేదన్నాను.. వెంటనే పరుగెత్తుకెళ్లి అప్పటికప్పుడు ఇదిగో ఈ కొత్త శారీ పట్టుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే నన్ను ఆయనే రెడీ చేశారు అని చెప్తుంది. దీంతో మేజర్ వైఫ్ నవ్వుతూ ఆశ్చర్యంగా ఉందే అమరేంద్ర ఇలాంటి పనులు కూడా చేస్తారా..? అంటుంది. దీంతో మిస్సమ్మ ఏం మీ వారు చేయరా మేడం అని అడుగుతుంది. ఆయన గురించి ఏం చెప్పాలిలే అమ్మా అంటుంది మేజర్ వైఫ్. కానీ మా వారు చేస్తారు.. ఆయన చేసే కొన్నిచిలిపి పనులు చెప్తే బాగోదు.. నన్ను అంత ఇష్టంగా చూసకుంటారు. ఒక్కోసారి ఆయన ప్రేమ భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటాను అని నవ్వుతూ పక్కకి చూడగానే.. పక్కనే అమర్ వచ్చి ఉంటాడు.
అమర్‌ను చూసిన మిస్సమ్మ షాక్ కొట్టినట్టు అలాగే నిలబడిపోతుంది. మేజర్ వైప్ మాత్రం ఏమయ్యా అమరేంద్ర మా అమ్మాయిని మరీ ఇబ్బంది పెడుతున్నావంట.. మరీ అంత ప్రేమ ఏంటయ్యా..? అని అడుగుతుంది. మిస్సమ్మ మాత్రం ఇరిటేటింగ్ గా దేవుడా ఇలా బుక్ చేశావేంటి.. అని మనసులోనే అనుకుంటుంది. తర్వాత అమర్, మిస్సమ్మను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. మధ్యలో మనోహరి పంపిన రౌడీలు వెంటపడటంతో వారి నుంచి తప్పించుకోవడానికి కారు వదిలి పారిపోతారు. అలా వెల్తూ ఒక గుడిసెలోకి వెళ్లి దాక్కుంటారు.
అప్పుడే వర్షం మొదలవుతుంది. అక్కడే మంట వేసుకుని ఇద్దరు చలి కాచుకుంటుంటారు. ఉరుములు మెరుపులు రావడంతో మిస్సమ్మ భయంగా వెళ్లి అమర్‌ను హగ్ చేసుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి. దీంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకుంటారు. అప్పుడే ఆరుకు గుప్త చెప్తుంటాడు. బాలిక నీ మరుజన్మగా నీ పతిదేవునికి.. నీ సహోదరికి పుత్రికగా పుట్టబోవుతున్నావు అని చెప్తాడు. ఇక మరోవైపు అమర్, మిస్సమ్మ మధ్య రొమాన్స్ జరుగుతుంది. ఇంకో వైపు గుప్త నీ మరు జన్మకు అంకురార్పణ జరగబోవుతున్నది బాలిక అని చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.