BigTV English

CM Chandrababu: ఉన్మాదాన్ని తరిమికొట్టిన రోజు.. సీఎం చంద్రబాబు కామెంట్స్, ఏపీలో సర్వేలతో కలకలం

CM Chandrababu: ఉన్మాదాన్ని తరిమికొట్టిన రోజు.. సీఎం చంద్రబాబు కామెంట్స్, ఏపీలో సర్వేలతో కలకలం

CM Chandrababu: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది కానుంది. ప్రభుత్వం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ నాలుగు నాటికి ఏడాది గడుస్తోంది. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని చెబుతూనే, అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజుగా వర్ణించారు.


ఏపీలో కూటమి ప్రభుత్వానికి జూన్ నాలుగు హిస్టారికల్ డే. ముఖ్యనేతల జీవితంలో ఈ రోజుకు ప్రాధాన్యత అంతాఇంతా కాదు.  ఎందుకంటే సరిగ్గా ఏడాది కిందట ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అంటూ రాసుకొచ్చారు.

ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా రాసుకొచ్చారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు అని గుర్తు చేశారు. సైకో పాలనకు అంతం పలికి, ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజని  ప్రస్తావించారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనకు నాంది పలికిన రోజుగా పేర్కొన్నారు.


ఏడాది కిందట ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పని చేస్తున్నట్లు అందులో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పట్టాలెక్కించామన్నారు.

ALSO READ: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరి కొద్దిగంటల్లో దంచుడే

రాష్ట్ర దశ, దిశను మార్చేందుకు ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేశారు. రానున్న నాలుగేళ్లు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పకనే చెప్పారు. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం- జనసేన-భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు అని రాసుకొచ్చారు సీఎం చంద్రబాబు.

సర్వేల కలకలం

ఇదే సమయంలో ఏపీలో IVRS ద్వారా సర్వే చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అధికారంలోకి రానుంది అనే అంశంపై సీక్రెట్‌గా IVRS సర్వే జరుగుతోంది. సర్వేని ఏ పార్టీ వాళ్లు చేస్తున్నారో తెలీదు. కాకపోతే అందులో అడిగే ప్రశ్నలు అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ 7313783051 నెంబర్ ద్వారా సర్వే జరుగుతోంది.

1. టీడీపీ, 2. వైసీపీ, 3. జనసేన-బీజేపీ అని ఆప్షన్స్ చెబుతోంది. కూటమి పాలన బాగుందా? లేదా? అనే ప్రశ్నలు రైజ్ చేస్తోంది. బాగుంటే ఒకటి నొక్కండి. నచ్చకపోతే రెండునొక్కండని చెబుతోంది. నార్మల్‌గా ఆ తరహా సర్వే టీడీపీ చేపడితే తొలుత కార్యకర్తల నుంచి IVRS ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఇప్పటివరకు కార్యకర్తలకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు.

IVRS సర్వేలో కూటమి నుంచి టీడీపీని విడగొట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీని వెనుక కచ్చితంగా వైసీపీ ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే జూన్ నాలుగున ఆ పార్టీ వెన్నుపోటు దినంగా వర్ణిస్తోంది. IVRS సర్వే వాళ్ల పనేనని కచ్చితంగా అంటున్నారు.

 

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×