Illu Illalu Pillalu Today Episode june 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. నర్మద అక్కడికి వెళ్లి ఏంటి ప్రేమ ఈ మధ్య నువ్వు ప్రేమలో పడినట్లు ఉన్నావు కదా అనేసి అడుగుతుంది. అదేంటి అక్క అలా అన్నావు అని అంటుంది ప్రేమ. ఏం లేదు ఈ మధ్య నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ధీరజ్ కోసం ఎదురు చూస్తున్నావు అంతా ఏదో కొత్త కొత్తగా ఉంది అని అంటుంది.. నర్మద మాట విన్న ప్రేమ సిగ్గుపడుతూ లోపలికి వెళుతుంది. అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు ప్రేమ ధీరజ్ కి ప్రేమగా వడ్డిస్తుంది. ఇదంతా చూస్తున్న నర్మదా నువ్వు కచ్చితంగా ధీరజ్ని ప్రేమిస్తున్నామని కన్ఫామ్ చేస్తుంది.. చందు తన భార్య విషయంలో మీ భార్యల జోక్యం చేసుకుంటే బాగోదని తమ్ముళ్లకు వార్నింగ్ ఇస్తాడు… అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తుంది. ఇంత తొందరగా నిద్ర లేచాను ఏంటి? అసలు నిద్ర పట్టడం లేదేంటి? నిజంగానే నేను ప్రేమలో ఉన్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది.. ధీరజ్ కి తనకి మధ్య లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి బుక్ తీసుకుని బయటకు వస్తుంది. బయటకూర్చున్న ప్రేమను చూసి ధీరజ్ దెయ్యం అంటూ కేకలు వేస్తాడు.. ఏ ఆపు దయ్యం కాదు నేనే అని ప్రేమ అంటుంది. ఇంత అర్ధరాత్రి బుక్కు పట్టుకుని ఏం రాస్తున్నావు అని ధీరజ్ అడుగుతాడు.. చదువుకుంటున్న కానీ ఇప్పుడు ఇదంతా నీకెందుకు అని ప్రేమ అడుగుతుంది.
ధీరజ్ నేను నీకు ఒక విషయం చెప్పాలి అని ప్రేమ అడుగుతుంది. ఏంటి ఆ విషయం అర్ధరాత్రి కూర్చొని మాట్లాడాల్సిన అంత అర్జెంటు విషయం ఏంటో చెప్పు అని ధీరజ్ అంటాడు. నేను హోమ్ ట్యూషన్ చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు నాకోసం చాలా చేస్తున్నావ్ కదా నీకోసం నేను చేయాలి కదా అని అనగానే.. ధీరజ్ షాక్ అవుతాడు. నువ్వు ఇలాంటి డెసిషన్స్ అస్సలు తీసుకోకు. మొన్న ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలుసు కదా.. మళ్లీ ఇప్పుడు మరో రచ్చ కి దారి తీస్తావా నువ్వు అని ధీరజ్ అంటాడు. నామీద నీకు ఎంత బాధ్యత ఉందో నీ మీద కూడా నాకు అంతే బాధ్యత ఉంది నువ్వేం మాట్లాడద్దు అని ధీరజ్ లాంటిది.
ఉదయం లేవగానే అన్నదమ్ములు ఒక్కొక్కరు ఒక్కో దిక్కున కూర్చొని ఉంటారు. అది చూసిన వేదవతి రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ములు ఇంత దూరంగా కూర్చొని ఉండడం నాకు బాధగా ఉంది అని మనసులో బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే బయటకు వచ్చినా రామరాజు వాళ్ళందరిని చూస్తాడు.. ఇక వేదవతి చూశారా అండి కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు ఎలా తలా ఒక దిక్కున కూర్చున్నారు అని అంటుంది.. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు కోడల సంగతి చూసుకొని రామరాజు ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలుస్తాడు.
మీ అమ్మ మొన్న చెప్పిన విషయం మర్చిపోయారా అని అడుగుతాడు. అదేరా మీ అమ్మ అన్నవరం కి వెళ్దామనింది కదా.. వచ్చే సోమవారం మనం అందరం కలిసి అన్నవరం కు వెళ్దామని అంటాడు. దానికోసం కారు మాట్లాడటం దగ్గర నుంచి అక్కడ ఉండడానికి రూములు. అలాగే దర్శనానికి టికెట్లు అన్నీ మీ ముగ్గురు దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తాడు. అన్నవరం అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది అని రామరాజు ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. ముగ్గురు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరం కలిసి అన్నవరం కి వెళ్ళాము.. జనం ఎక్కువగా ఉండడంతో మీ ముగ్గురు తప్పిపోకుండా ఉండడానికి ఒక చేయి ఒకరు పట్టుకోమని నేను చెప్పాను అలాగే ఇంటికొచ్చేంత వరకు ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఉన్నారు.
ఇప్పటికీ మీ ముగ్గురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.. అనాధగా ఉన్న నాకు మీ అమ్మ తోడుగా నిలిచింది. మా ఇద్దరికీ మీ ముగ్గురు అండగా వచ్చారు. మీ ముగ్గురిని చూసి నేను చాలా గర్వపడుతుంటాను రా అని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఎవరైనా రామరాజు నువ్వు ఏం సంపాదించావు అని అడిగితే వజ్రాలు లాంటి నా ముగ్గురు కొడుకులు సంపాదించుకున్నాను అని చెప్తాను. మెదటి కూడా మీరు అలానే ఉండాలి అని వాళ్ళ ముగ్గురికి క్లాస్ పీకి వెళ్ళిపోతాడు.
వీళ్ల ముగ్గురిని ఈయన కలిపేశాడు కోడళ్ళ విషయం నేను చూసుకుంటాను అని వేదవతి అంటుంది. ముగ్గురు కోడలు ను పిలిచి సీరియస్ గా క్లాస్ పీకాలని ముగ్గురిని పిలుస్తుంది. అయితే నర్మదా మధ్యలో సెటైర్లు వేయడంతో వేదవతి సీరియస్ అవుతుంది. మీ ముగ్గురు కోడలు సొంత అక్క చెల్లెలు లాగా కలిసి ఉండాలని అంటుంది.. ఏదైనా పంచాయతీ జరిగితే ఇక్కడే మీ ముగ్గురిలోనే తెలుసుకోవాలి అంతేకానీ నట్టింట్లోకి అస్సలు పెట్టకూడదని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది.. నర్మదా ప్రేమ మాత్రం శ్రీవల్లిని పక్కనపెట్టి వాళ్ళిద్దరూ ఒక్కటే అయిపోతారు.
మీరు క్లాస్ చెప్పడం అయిపోతే నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని నర్మదా సెటైర్లు వేస్తుంది. ప్రేమ కూడా నేను కాలేజీకి వెళ్లాలని వెళ్ళిపోతుంది. శ్రీవల్లి కూడా వంట గదిలో నాకు పని ఉందని వెళ్ళిపోతుంది. వీళ్ళ ముగ్గురు నా మాట విన్నట్టా లేనట్టా అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ బయటకు వెళ్తుంటే నర్మదా ఆగు ప్రేమ నీ కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి.. రాత్రంతా ధీరజ్ పై ప్రేమను ఎలా చూపించాలని ఆలోచిస్తున్నావు కదా అని అడుగుతుంది. అది విన్న ప్రేమ ఇదేంటి అక్క నా పక్కన కూర్చొని చూసినట్లు చెబుతుంది అని ఆలోచిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..