BigTV English

Intinti Ramayanam Today Episode: అవని, అక్షయ్ మధ్య ఫిట్టింగ్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్.. కోడళ్ల మధ్య నలిగిపోతున్న పార్వతి..

Intinti Ramayanam Today Episode: అవని, అక్షయ్ మధ్య ఫిట్టింగ్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్.. కోడళ్ల మధ్య నలిగిపోతున్న పార్వతి..

Intinti Ramayanam Today Episode june 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయా నాకు మర్యాద లేదు.. ఈ ఇంట్లో నాకు విలువ లేదని ఇప్పుడు ఇదంతా గోడవెందుకమ్మా అని పార్వతి అంటుంది. పల్లవి శ్రీయా అన్నది కూడా నిజమే కదా.. నువ్వు నా మేనకోడలు కాబట్టే నీకు పెత్తనం ఇచ్చానని అనుకుంటుంది ఆ తాళలేవో శ్రియాకి ఇచ్చేయమ్మా అనేసి పల్లవి కే షాక్ ఇస్తుంది పార్వతి.. శ్రియ మాత్రం నాకు ఇంట్లో విలువ లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి పదం మనం అనేసి బ్యాగ్స్ అద్దుకొని శ్రీకర్ దగ్గరికి వస్తుంది. శ్రీకర్ పద వెళ్లిపోదాం.. మనకు ఈ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదని పల్లవి అంటుంది కదా.. ఇంట్లో నా మాటకే విలువ ఉంది నీ మాటకి విలువ లేదు అని ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్దాం అని శ్రీయా అంటుంది. మీరు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాము అని కమల్ పల్లవితో అంటాడు. కానీ పల్లవి మాత్రం నేను అంటుంది. అవని ఆఫీసులో అక్షయ్ పక్కన కూర్చోవడం చూసి పల్లవి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆఫీస్ అవ్వగానే అక్షయ్ తన కారు గురించి డ్రైవర్ తో అడుగుతాడు. కారు సర్వీసింగ్ కి ఇచ్చాం సార్ కాస్త లేట్ అవుతుంది అని అతను చెప్పగానే మరో డ్రైవర్ని అక్షయ్ పిలుస్తాడు. ఈ కార్ ని అవని మేడం కోసం వాడమని రాజేంద్రప్రసాద్ సార్ చెప్పారండి అని అక్షయ్కి చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని నీకు అభ్యంతరం లేదు అంటే మనం ఇద్దరం ఒకే కారులో వెళ్దాం. నన్ను డ్రాప్ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటుంది. నీతో పాటు కార్లో రావాల్సిన అవసరం నాకు లేదు అని అక్షయ్ అంటాడు.

నన్ను మీరు మీ కొలీగ్ అనుకుంటే నాతో పాటు కార్లో రండి. మీ భార్య అనుకుంటే మాత్రం మీరు రావద్దు అని అవని అంటుంది. నేను నిన్ను కొలిగ్గానే ఫీలవుతున్నాను అని అక్షయ్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు. అవని అక్షయ్ ఇద్దరు కలిసి ఒకే కారులో ఆరాధ్య దగ్గరికి వెళ్తారు.. వాళ్ళిద్దర్నీ చూసినా ఆరాధ్య మీరు ఇద్దరు కలిసిపోయారా? అని అడుగుతుంది. కానీ అక్షయ్ మాత్రం మనం వేరే వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన కలిసిపోయినట్లు కాదమ్మా నేను నిన్ను చూడడానికి వచ్చాను అని అంటాడు.


ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం మీ అమ్మకు నేను దూరంగా ఉన్నా మీ అమ్మ గురించి నేను ఆలోచిస్తున్నాను. మా ఇద్దరి మధ్య అనుబంధం అలాంటిది. మా ఇద్దరికీ పిల్లలు కలిగారు కాబట్టి నా భార్య నా కోసం ఎదురుచూస్తుందని నమ్మకం నాకుంది నీకు ఏ కోసనా అవని గురించి అలాంటిది లేదు కదా అని పెద్ద క్లాసు ఇస్తాడు. అక్షయ్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని మీరు ఎందుకు మామయ్య ఆయనతో ఇలా మాట్లాడారు. ఇప్పటికే నేను ఆయన పక్కన ఆఫీసులో కూర్చున్నానని ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పిన మాట కోసమే నన్ను భరిస్తున్నట్లు అనిపిస్తుంది అని అవని అంటుంది. దానికి రాజేంద్రప్రసాద్ మాత్రం అలా ఉంటేనే వాడు మనదారికి వస్తాడమ్మా నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు.

అటు ఇంట్లో శ్రియ పల్లవి ఇద్దరూ నువ్వా నేనా అని పంతానికి దిగిపోతారు.. నీకెందుకు హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. అక్కడికి అక్షయ్ వస్తాడు. పార్వతి ఏమైందిరా అలా ఉన్నావ్ అని అడుగుతుంది. దానికి అక్షయ్ అవని పక్కన కూర్చొని పనిచేయడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. కేవలం నాన్న చెప్పారని మాత్రమే నేను అక్కడ ఉన్నాను అని అంటాడు. దానికి పల్లవి నువ్వు ఆఫీస్ నుంచి మానేయాలనే బావగారు మామయ్య ఇలా చేశారు.

మీ అక్కని ఇదంతా ప్లాన్ చేసి మామయ్య చేత చేయించింది అంటూ అంటుంది. అవని యొక్క తెలివి ముందు మనం ఏ మాత్రం పనికి రాము. ఆఫీస్ మానేస్తే ఇక ఆఫీస్ మొత్తం అవని యొక్క చేతికే వెళ్లిపోతుంది కదా అలా అవని యొక్క ప్లాన్ చేసింది అని పల్లవి అంటుంది. దానికి శ్రీయ నీకున్న అని తెలివితేటలు అవని అక్కకు లేవులే అని సెటైర్లు వేస్తుంది.. ఇద్దరూ మరోసారి పోట్లాడుకుంటారు. ఇక భానుమతి మాత్రం తన భర్త ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటుంది.. అప్పుడే వచ్చిన కమలాకర్ నువ్వు అవని విషయంలో తప్పు చేస్తున్నావ్ ఇది సరిదిద్దుకుంటే నేను రోజు నీ దగ్గరికి వస్తాను అని అంటాడు.

తర్వాత రోజు ఉదయం ఆఫీసులో అవని దగ్గరికి సుదర్శన్ కంపెనీ నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అవని రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి ఆ కంపెనీ గురించి వివరాలను అడిగి తెలుసుకుంటుంది. ఈ డీల్ గురించి నేను చూస్తాను.. సైన్ చేస్తాను నువ్వు ఇంటికి తీసుకురా అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. దానికి అవని సరే మామయ్య నీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. అవని ఇంటికి వెళ్తుంటే మధ్యలో మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకోవాలని ఆగుతుంది. పల్లవి అవనిని ఇరికించేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తుంది. ఆ ఫైల్స్ ని మార్చేందుకు అవనిని ఫాలో అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని తెలివిగా పల్లవి ప్లాన్ ని తిప్పి కొడుతుందా? అవినీకి సపోర్టుగా అక్షయ్ నిలుస్తాడా? చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×