BigTV English

Jagan : పెత్తందార్లతో క్లాస్‌ వార్‌..పేదవాడికి చదువే అస్త్రం : జగన్

Jagan : పెత్తందార్లతో క్లాస్‌ వార్‌..పేదవాడికి చదువే అస్త్రం : జగన్

AP CM Jagan meeting today(Latest news in Andhra Pradesh) : ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2023 జనవరి–మార్చి త్రైమాసికా­నికి సంబంధించిన ఈ పథకం నిధులు విడుదల చేశారు. బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు. దీంతో 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరింది. విద్యాదీవెన పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాన్నారు సీఎం.


ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలు సామాజికంగా ఎదగాలని జగన్ ఆకాంక్షించారు. పేదరికం పోవాలంటే చదవే గొప్ప అస్త్రమని తెలిపారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గంగా పేర్కొన్నారు. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్‌ కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే దశ దిశ చూపిస్తుందన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయన్నారు.పేద కుటుంబాల పిల్లలు డాక్టర్లు, కలెక్టర్లు కావాలని ఆకాంక్షించారు.

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిందన్నారు. ఉన్నత విద్యలో జాబ్‌ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్‌ తీసుకొచ్చామన్నారు. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్‌ కోర్స్‌ ప్రవేశపెట్టామని తెలిపారు. పిల్లల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలన్నారు. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.


గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారని సీఎం జగన్ మరోసారి విమర్శించారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అని విమర్శించారు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేదన్నారు. తనను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయన్నాయంటూ ఘాటు విమర్శలు చేశారు. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్‌ జరుగుతోందన్నారు. పేదవాడికి చదువే అస్త్రంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Related News

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు

Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..

Tirumala News: తిరుమల కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం.. మహిళల్లో ఆనందం, కాకపోతే

Big Stories

×