TSLatest Updates

Revanth Reddy : అక్రమ సంపాదన దాచడానికే కేటీఆర్ విదేశాలకు.. రేవంత్ కలకలం..

Revanth Reddy's sensational comments on withdrawal of GO 111

Revanth Reddy News Today(Today breaking news in Telangana) : జీవో 111 ఎత్తివేత అంశం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ జీవో ఉపసంహరణ వెనుక భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబం 111 జీవో పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేసిందన్నారు. ఆ తర్వాతే ఈ జీవోను ఎత్తేశారని విమర్శించారు.

2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో కొన్న భూములు వివరాలు వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే హెచ్‌ఎమ్‌డీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. 111 జీవో ఉపసంహరణను వ్యతిరేకిస్తూ ఎన్‌జీటీకి వెళ్తామని ప్రకటించారు.

ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపైనా రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఐఆర్‌బీ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డును ఎలా కట్టబెడతారని నిలదీశారు. శుక్రవారంలోపు ఐఆర్‌బీ సంస్థ హెచ్‌ఎండీఏకు 10 శాతం నిధులు చెల్లించాలన్నారు. లేదంటే ఓఆర్ఆర్ టెండర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమేశ్, అరవింద్‌కుమార్ ఈ తతంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. ఓఆర్ఆర్‌పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ పైనా రేవంత్ విమర్శలు గుప్పించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి కేటీఆర్ విదేశాలకు వెళ్లారని విమర్శించారు.

Related posts

Twitter Employees : ట్విట్టర్‌ ఉద్యోగుల మెడపై కత్తి

BigTv Desk

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఆ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Bigtv Digital

New type of Robots : కొత్త రకం రోబోలు.. వచ్చే అయిదేళ్లలో మార్కెట్లోకి..

Bigtv Digital

Leave a Comment