BigTV English

Radio Astronomy:ఆస్ట్రానమీలో కొత్త అధ్యయనం.. అబ్జర్వేటరీ సాయంతో..

Radio Astronomy:ఆస్ట్రానమీలో కొత్త అధ్యయనం.. అబ్జర్వేటరీ సాయంతో..

Radio Astronomy:అంతరిక్షం గురించి, నక్షత్ర మండలం గురించి స్టడీ చేసే ఆస్ట్రానమీలో కూడా టెక్నాలజీ అనేది ఎన్నో కొత్త మార్పులు చేసుకుంది. వీటి ద్వారానే అంతరిక్షంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతున్నారు. ఇక స్పేస్ గురించి స్టడీ చేసే ఈ ఆస్ట్రానమీలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి రేడియో ఆస్ట్రానమీ. తాజాగా రేడియో ఆస్ట్రానమీలో ఓ కొత్త టెక్నాలజీ తయారీకి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.


21వ సెంచరీలో రేడియో ఆస్ట్రానమీలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకే దానిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్క్వేర్ కిలోమీటర్ ఆర్రే (స్కా) పేరుతో అబ్జర్వేటరీ తయారు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఆస్ట్రానమీ అనేది సైన్స్ యొక్క మొదటి అధ్యాయానంగా ప్రారంభమయ్యి టెలిస్కోప్ తయారీతో ఊహించని మలుపు తిరిగింది. ఇక ఏడు దశాబ్దాల క్రితం రేడియో ఆస్ట్రానమీ అనేది ప్రారంభమయ్యి మరో సంచలనాన్ని సృష్టించింది.

రేడియో ఆస్ట్రానమీకి సాయంగా పూణెలో జైంట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జిఎమ్ఆర్టీ) ఏర్పాటయ్యింది. తాజాగా స్కా కూడా రేడియా ఆస్ట్రానమీకి సాయంగా నిలబడనుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కంటే ఎంతో అడ్వాన్స్‌గా ఆలోచించి స్కా అబ్జర్వేటరీని తయారు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. స్కా తయారీలో మొదటి ఫేజ్ 2022లో ప్రారంభమయ్యిందని, 2030లో పూర్తవుతుందని వారు అన్నారు. స్కాకు సంబంధించి 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో 200 డిష్ యాంటినాలు ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఈ యాంటినాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


స్కా ఏడాదికి 1 పేటాబైట్ డేటాను స్టోర్ చేసి ఉంచగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిని వినియోగించడానికి మరిన్ని అడ్వాన్స్ సైన్స్ టెక్నిక్స్ కావాలని వారు తెలిపారు. టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ కూడా స్కా ఏర్పాటులో భాగంకానుంది. ప్రస్తుతం తయారీ ఏర్పాటులో ఉన్న స్కా మరింత ముందుకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంది. దానికోసమే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×