Big Stories

Jagan : ఆ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..?

Jagan : వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

వాస్తవంగా సోమవారం సీఎం అనంతపురం జిల్లాలో పర్యటించారు. నార్పలలో వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఆదివారం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత సీఎం పర్యటన వాయిదా పడింది. అప్పటి నుంచే వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనే అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు సీఎం జగన్ అధికారిక సమీక్షలు రద్దు చేసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీకావడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు అవినాష్‌ రెడ్డి.. పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయల్దేరినపుడు ఆయనతోపాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుపై అవినాష్‌తో చర్చించిన అంశాలను సీఎం జగన్‌కు చెవిరెడ్డి వివరించారని సమాచారం. ఎంపీ అవినాష్‌ రెడ్డి విషయంలో జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News