CM Jagan : వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.. అయితే పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.. పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారంట.. అందుకే కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్లు బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్ గా నేతలకే చెప్తున్నారంట.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి పోతున్నా ఆయన సైలెంట్ ఉండటం అందుకే అంటున్నారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ జంపింగ్ లు సర్వ సాధారణం.. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి.. ప్రతి పక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి.. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు మారిపోతుంటారు.. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందు నుంచే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలు పెట్టారు.. అధికారంలో ఉన్న వైసీపీని కాదని తెర వెనుక టీడీపీతో జత కట్టారు కొందరు ఎమ్మెల్యేలు.. ఆ తెరవెనుక వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బహిర్గతం అవ్వడం.. తరువాత జరిగిన పరిణామాలతో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ పంచన చేరారు..
ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరించడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన వైసీపీ.. పార్టీలో అటువంటి వారు ఇంకెంత మంది ఉన్నారా? అని నిఘా పెట్టిందంట.. సొంత పార్టీకి సున్నం పెడుతున్న వారి వివరాలు సేకరిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోందంటున్నారు.. టీడీపీ, జన సేన పార్టీలతో టచ్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వివరాలను రాబడుతున్నారంట.. అభ్యర్థుల మార్పు ప్రక్రియ చేపట్టిన వైసీపీ పక్కచూపులు చూస్తున్న వారి వివరాలను కూడా పరిగణలోకి తీసుకుంటోందంటున్నారు..
సీటు ఆశించి భంగపడ్డ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూనే.. వారు పార్టీలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని.. నేరుగా చెప్పేస్తున్నారంట వైసీపీ ముఖ్యులు.. పార్టీలో ఉంటూనే కోవర్టులుగా మారిన వారిని మాత్రం ఉపేక్షించేది లేదని.. గత ఎన్నికల్లో పదవులు ఆశించి భంగపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించిన అంశాన్ని గుర్తు చేస్తూ.. నమ్మిన వారికే ప్రాధ్యానత ఉంటుందని స్పష్టం చేస్తున్నారంట.
2014 లో వైసీపీ ఓటమి పాలైన తరువాత 23 మంది ఎమ్మేల్యేలు, ముగ్గురు ఎంపిలు పార్టీని వీడిన అంశాన్ని వారందరికీ గుర్తు చేస్తూ.. ఇప్పుడు కూడా పార్టీని వీడి వెళ్ళే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారంట వైసీపీ అధినేత… ఎంత మంది పార్టీని వదిలిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ లోని మిగతా నేతలకు సంకేతాలు పంపుతున్నారంట. త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు పార్టీని వీడతారని సమాచారం ఉన్నా జగన్ లైట్ తీసుకోమంటున్నారంట.. మరి ఆయన ధీమా ఏంటో?