BigTV English

CM YS Jagan: టీ గ్లాస్ సింకులో.. సైకిల్ బయట.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి!

CM YS Jagan: టీ గ్లాస్ సింకులో.. సైకిల్ బయట.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి!
CM YS Jagan Public Meeting

CM YS Jagan Public Meeting in Raptadu: పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లుకు రాజకీయం అవసరమా..? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాప్తాడులో నిర్వహించిన బహిరంగ సభకు వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేదలకు, పెత్తందారులకు మద్యం యుద్దం జరుగుతుందన్నారు.


వైఎస్సార్‌సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తుకువస్తాయని జగన్ అన్నారు. చంద్రబాబునాయుడు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తు వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చామన్నారు. ప్రతీ అక్క చెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్‌ తీసుకొచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.

ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని జగన్ అన్నారు. సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింకులోనే ఉండాలని జగన్ ఎద్దేవా చేశారు. హామీలు ఇచ్చి ఎగ్గొట్టేవారే .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అని చెబుతారన్నారు. మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం అయినా ఇస్తాను.. చుక్కల్ని దింపుతా అని నెరవర్చని హామీలు ఇస్తారు, వాటిని ఎవ్వరూ నమ్మవద్దని జగన్ సూచించారు.


గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చామని జగన్ అన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. ఓట్లు అడుక్కునేందుకు మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని, మీరంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. అభివృద్దిలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా ? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Read More: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!

1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడన్నారు. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవ్వరికీ గుర్తుకు రాదన్నారు. జరగబోయే ఎన్నికల్లో తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదన్నారు. ప్రజలతోనే మాకు పొత్తు అని స్పష్టం చేశారు.

చంద్రబాబు తన సైకిల్ ను తోయడానికి ప్యాకేజీ స్టార్ ను పెట్టుకున్నాడని సీఎం జగన్ అన్నారు. ఈ సారి పొరపాటు చేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు. చంద్రముఖి నిద్రలేచి గ్లాస్ తీసుకొని ప్రజల రక్తం త్రాగడానికి బయలుదేరుతుందని ఎద్దేవా చేశారు. 57నెలల వైసీపీ పాలనలో చిత్తశుద్దితో పాలించామన్నారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రతి ఇంట్లో జరిగిన మంచినీ ప్రతి ఒక్కరికీ వివరించాలని జగన్పి పిలుపునిచ్చారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×