BigTV English

Vidyasagar Maharaj: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత.. మోదీ సంతాపం..

Vidyasagar Maharaj: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత.. మోదీ సంతాపం..

Jain Seer Acharya Vidyasagar Maharaj: జైన మత ధర్మకర్త, ముని ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ ఇకలేరు. ఆదివారం ఆయన కన్నుమూశారు. చత్తీస్‌గఢ్‌ డోంగర్‌గఢ్‌ తీర్థంలో కొన్ని రోజులుగా విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు. సల్లేఖనదీక్ష చేపట్టి మూడు రోజులుగా ఆహార, పానీయాలు తీసుకోవడం మానేశారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తుదిశ్వాస విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు.


ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. జైన మత గురువు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆయన సేవ చిరస్మరణీయమని ప్రశంసించారు. పేదరిక నిర్మూలన కోసం ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ పాటుపడ్డారని కొనియాడారు. ప్రజల ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారని తెలిపారు.

విద్యాభివృద్ధికి కోసం జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ పేర్కొన్నారు. గతేడాది ఆచార్యను కలిసిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జైన గురువు ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టంగా పేర్కొన్నారు.


Read More: జ్ఞాన్ పీఠ్ గ్రహీతలు గుల్జార్, రామభద్రాచార్యులు.. వారి జీవిత విశేషాలివే..

సమాజాభివృద్ధికి కోసం ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ చేసిన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ఆచార్యతో కలిసి దిగిన ఫోటోను ప్రధాని షేర్‌ చేశారు. ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్ మృతిపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ సంతాపం ప్రకటించారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×