BigTV English

CM MK Stalin Meet Chandrababu: చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ, అరగంటపాటు రాజకీయాలపై

CM MK Stalin Meet Chandrababu: చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ, అరగంటపాటు రాజకీయాలపై

CM MK Stalin Meet Chandrababu(Andhra politics news): ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఎన్డీయే మిత్రులతో మంతనాలు సాగిస్తోంది.


దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మంచి సంబంధాలున్నాయి. అప్పట్లో ఆయా నేతలతో కలిసి పని చేశారు కూడా. కాంగ్రెస్, బీజేపీ సహా  తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, పంజాబ్, హర్యానా, బీహార్, ఒడిషా, కమ్యూనిస్టు నేతలతో మంచి సంబంధాలున్నాయి.

ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడు గురించి చెప్పనక్కర్లేదు. సీఎం స్టాలిన్-చంద్రబాబు సంబంధాల గురించి చెప్పనక్కర్లేదు. డీఎంకె అధినేత కరుణానిధి- చంద్రబాబు  రిలేషన్స్ గురించి అందరికీ తెల్సిందే. ఈ క్రమంలో ఎన్డీయే సమావేశానికి చంద్రబాబునాయుడు, ఇండియా కూటమి కోసం సీఎం స్టాలిన్ ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో చంద్రబాబుతో భేటీ అయ్యారాయన. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.  ఇరువురు నేతలు దాదాపు అరగంట పైగానే రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏం మాట్లాడారనేది ఆసక్తికరంగా మారింది.


ALSO READ: మోదీ కేబినెట్‌లో ఐదారు కేబినెట్ మంత్రులపై కన్నేసిన చంద్రబాబు!

తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు సీఎం స్టాలిన్. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం తనకు ఉందని, దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతారని భావిస్తున్నట్లు అందులో ప్రస్తావించారు సీఎం స్టాలిన్.

 

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×