BigTV English

Samantha: నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నాను: సమంత

Samantha: నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నాను: సమంత

Samantha Ruth Prabhu: స్టార్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. పెద్దగా టాలీవుడ్‌లో సినిమాలలో నటించకపోయినా.. బాలీవుడ్‌లో పలు సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లో ప్రస్తుతం హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ రీమేక్‌లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో మాస్ యాక్షన్ సీన్లలో అదరగొట్టనుంది. తన కెరీర్‌లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత సామ్ ఇలాంటి సినిమాలలో నటించడానికి సిద్ధమైంది. త్వరలో ఈ సిరీస్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.


దీంతోపాటు సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే మూవీలో కూడా నటిస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చిత్రానికి ఆమె నిర్మాత కావడం.. అలాగే ఈ సినిమా సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై రూపొందుతోంది. సమంత సొంత నిర్మాణ సంస్థపై రూపొందుతోన్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా సామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఇటీవల ఐఎండీబీ ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సమంత 13వ స్థానం దక్కించుకుంది. దీంతో సామ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ దీనిపై స్పందించింది. ఐఎండీబీ లిస్ట్‌లో 13వ ప్లేస్ స్థానాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.


Also Read: నువ్వు గెలిస్తే చూడాలని ఉంది.. నీ కోసం ప్రార్థిస్తున్నాను.. సమంత పోస్ట్ వైరల్

ఇది తన కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నానని పేర్కొంది. అయితే ఇలాంటివి పొందినప్పుడు ఒక్కోసారి కెరీర్‌ను ఇప్పుడే మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది అని అన్నారు. అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచిపోయాయో అస్సలు అర్థం కావడం లేదని.. ఏది ఏమైనా ప్రస్తుతం గొప్ప సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇకపై మరింత కష్టపడి పని చేస్తానని తెలిపింది.

అంతేగాక ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త కొత్త హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందని.. ఆరోగ్యకరమైన పోటీ అందరికీ మంచిదేనని తెలిపింది. దానివల్ల ఆలోచనా శక్తి కూడా పెరుగుతుందని చెప్పుకొచ్చింది. నేను ఇక నా తోటి హీరోయిన్లను చూసి స్ఫూర్తి పొందుతుంటానని పేర్కొంది. ప్రస్తుతం సామ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×