BigTV English

Gurajada Award : గురజాడ పురస్కారానికి చాగంటి అర్హుడు కాదా?…అసలు వివాదమేంటి?

Gurajada Award : గురజాడ పురస్కారానికి చాగంటి అర్హుడు కాదా?…అసలు వివాదమేంటి?

Gurajada  Award  : ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు చుట్టూ వివాదం రాజుకుంది. మహాకవి గురజాడ వేంకట అప్పారావు పేరిట ఇస్తున్న పురస్కారం ఈ వివాదానికి కారణమైంది. చాగంటికి గురజాడ అవార్డు ఇవ్వాలన్న నిర్ణయంపై కవులు , రచయితలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరంలో గురజాడ ఇంటి నుంచి ర్యాలీ తీశారు. ఈ నిరసన ప్రదర్శనలో అభ్యుదయ రచయితలు, కవులు పాల్గొన్నారు. చాగంటికి గురజాడ పురస్కారం ఇవ్వొదని నినదించారు.


అవార్డు కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాగంటి గురజాడకు వారసుడు ఎలా అవుతారు పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలుగు చైతన్యానికి మొదటి వ్యక్తి గురజాడని పేర్కొంటున్నారు. గురజాడ భావజాలాన్ని అనుచరిస్తున్న వారికే అవార్డు ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. సంప్రదాయవాదులకు గురజాడ పేరిట ఏర్పాటు చేసిన అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. చాగంటి గొప్పవారే కానీ ఆయన మార్గంవేరని అంటున్నారు. గురజాడ వచనం వేరు చాగంటి ప్రవచం వేరని స్పష్టం చేస్తున్నారు. ఆధునికత కోసం , ప్రజల భాష కోసం పనిచేసేవారికి అవార్డు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గురజాడ అవార్డు వివాదంపై చాగంటి స్పందించారు. గురజాడ అంటే గౌరవం ఉందని అందుకే అవార్డును తీసుకునేందుకు అంగీకరించానని తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఏటా గురజాడ విశిష్ట పురస్కారాన్ని నిర్వాహకులు అందజేస్తున్నారు. నవంబర్ 30వ తేదీన గురజాడ వర్థంతి సందర్భంగా ఈ ఏడాది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఈ పురస్కరాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని హేతువాదులు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారు. గురజాడ అప్పారావు తన జీవితకాలం హేతువాదిగా, అభ్యుదయవాదిగా ఉన్నారని, అందుకు భిన్నమైన మార్గంలో సాగుతున్న చాగంటి భగవంతుడి గురించి ప్రవచనాలు చెబుతారని, పరస్పర విరుద్ధ వైఖరులతో ఉన్నప్పుడు అవార్డు ఎలా ప్రకటిస్తారంటున్నారు. పురస్కారాన్ని ప్రదానం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. గురజాడ భావజాలానికి వ్యతిరేక భావజాలం కలిగిన చాగంటిని ఎలా ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసనల మధ్య 30వ తేదీన పురస్కారాన్ని చాగంటి అందుకుంటారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.


ఇప్పటి వరకు గురజాడ పురస్కారాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం, గరికపాటి నరసింహారావు, డైరెక్టర్ కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డైరెక్టర్ క్రిష్, రామజోగయ్యశాస్త్రి, తనికెళ్ల భరణి, అంజలీదేవి, గుమ్మడి, షావుకారు జానకి, సి.నారాయణరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, మల్లెమాల, రావి కొండలరావు, డైరెక్టర్ వంశీ, నాగభూషణ శర్మ తదితర ప్రముఖులు అందుకున్నారు. గతంలో ఈ తరహా వివాదం ఎప్పుడూ తలెత్తలేదు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×