BigTV English
Advertisement

Indrakiladri EX EO: ఇంద్రకీలాద్రిపై పట్టుచీరల వేలంలో అవకతవకలు.. మాజీ ఈఓ చేతివాటం

Indrakiladri EX EO: ఇంద్రకీలాద్రిపై పట్టుచీరల వేలంలో అవకతవకలు.. మాజీ ఈఓ చేతివాటం

Indrakiladri EX EO Bhramaramba: కనకదుర్గమ్మతల్లి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి ఆలయంలో మాజీ ఈఓ భ్రమరాంబ చేతివాటం ప్రదర్శించినట్లు ఆడిట్ లో తేలింది. అమ్మవారికి అలంకరించిన పట్టుచీరలను వేలం వేయగా.. అందులో రూ.2 కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చింది ఆడిట్ టీమ్. 2021-23 సంవత్సరాల మధ్య వేలం వేసిన పట్టుచీరలకు రూ.2 కోట్లు నష్టం వచ్చినట్లు ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. పట్టుచీరల వేలం, బార్ కోడ్ ట్యాగింగ్ లో అవకతవకలు జరిగినట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా మాజీ ఈఓ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో మాజీ ఈఓ నుంచి ఆ రూ.2 కోట్లను రికవరీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


భక్తులు అమ్మవారికి సమర్పించిన విలువైన పట్టుచీరల సేకరణ, వేలం నిర్వహణలో ఆడిట్ అభ్యంతరాలు వెలువడ్డాయి. చీరల వేలంతో ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. కొందరు ఆలయ అధికారులు ఆ కాంట్రాక్టును రూ.3 కోట్లకే కేటాయించడంపై ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఆడిట్ విభాగం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. చీరల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల్ని కంప్యూటర్లో నమోదు చేయడంలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు సమాచారం.

Also Read : ఆషాఢ బోనాలు ఎందుకంత ప్రత్యేకం.. అసలు బోనాలు రోజున ఏం చేస్తారు ?


కాగా.. ఈ ఏడాది తొలిసారి ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలను నిర్ణయించాలని ఈఓ రామారావు నిర్ణయించారు. జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఉత్సవాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. అలాగే నెలరోజులపాటు ఆలయంలో ఆషాఢమాస సారె మహో త్సవాన్ని నిర్వహిస్తామని, భక్తులు మ్మవారికి సారెను సమర్పించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అలాగే జూలై 14న మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని, జూలై 19 నుంచి 3 రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

 

 

Tags

Related News

Google AI: వైజాగ్‌ గూగుల్ AI సెంటర్‌ ప్రత్యేకతలు ఇవే.. వామ్మో, ఒక్కసారే అన్ని ఉద్యోగాలా?

AP Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు, నాలుగు బృందాలు తనిఖీలు

YS Jagan: నకిలీ మద్యం, నకిలీ బీరు.. జగనూ! ఇదంతా నువ్వు చేసిందే కదయ్యా!

Modi – Jagan: కర్నూలు సభలో మోదీ ఆ ఒక్క పని చేయగలరా? అదే జరిగితే..

Google in Vizag: విశాఖలో డేటా సెంటర్.. గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం, రూ.1,33,000 కోట్ల భారీ పెట్టుబడి!

AP Govt: ఏపీలో మహిళలకు శుభవార్త, ఇంకెందుకు ఆలస్యం, హాయిగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు,

Delhi Politics: ఎంపీలతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ, వైసీపీ నేరాలపై అలర్ట్ అంటూ..

Tirumala News: హైకోర్టు సీరియస్.. తిరుమలలో సీఐడీ డీజీ, సీల్డ్ కవర్‌లో నివేదిక?

Big Stories

×