BigTV English

VenkyAnil3: వెంకటేష్‌తో ఇద్దరు హీరోయన్లు.. షూటింగ్ ప్రారంభం

VenkyAnil3: వెంకటేష్‌తో ఇద్దరు హీరోయన్లు.. షూటింగ్ ప్రారంభం

VenkyAnil3 movie Pooja Ceremony: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త మూవీ రానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎఫ్ – 2, ఎఫ్ – 3 వంటి సినిమాలు వచ్చాయి. మళ్లీ మూడోసారి వీరిద్దరూ కాంబోలో ఈ సినిమా అనౌన్స్ మెంట్ రావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. తాజాగా, దీనికి సంబంధించిన విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం హీరోయన్ల ఫస్ట్ లుక్ వైరల్ అవుతున్నాయి.


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జూలై 3న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటల 16 నిమిషాలకు పూజ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్ వెంకటేష్ భార్యగా నటిస్తుండగా.. మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు.

ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరిలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. చీర కట్టులో ఐశ్వర్య రాజేశ్ గృహిణిలా కనిపిస్తుండగా.. గన్ పక్కన తాళి బొట్టు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక, మీనాక్షి చౌదరి చేతిలో గన్ ఉండగా.. ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో గన్ పక్కన గులాబీ ఉంది. కాగా, ఈ మూవీలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్ పాత్ర ఉంటుందని ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే..ఐశ్వర్య రాజేశ్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలతో నటిస్తుంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. కేవలం గ్లామర్ రోల్స్, హీరోయిన్ పాత్రలకే కాకుండా కంటెంట్ ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. కాగా, అంతకుముందు తెలుగులో విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×