Perni Nani: టీడీపీ నేతలందరికీ జగన్ తర్వాత అంత టార్గెట్ అయ్యే వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ, ప్రోత్సాహం చూసుకొని చెలరేగిపోయిన పేర్ని నాని, ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి దాదాపు సైలంట్ అయిపోయారు. జగన్ మాట కాదనలేక అడపాదడపా బయటకు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై మొక్కుబడిగా రెండు విమర్శలు విసిరి వెళ్ళిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, ఆక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తుందా? అంటే ఔననే సమాధానం వస్తుంది.. రాష్టంలో వైసీపీకి బలమైన సీమలోనే.. ఫ్యాన్ పార్టీ నాయకులను కేసుల చట్రంలో బిగిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కూటమి.
ఇక తాజాగా పేర్ని నానిపై క్రిమినల్ కేసు నమోదుకు సివిల్ సప్లై శాఖ ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నంలో నానికి చెందిన సివిల్ సప్లై గోడౌన్‌లో 90 లక్షల విలువైన రేషన్ బియ్యం గల్లంతైనట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో నానిపై క్రిమినల్ కేసులతో పాటు..రెట్టింపు జరిమానా కోటి 80 లక్షలు జరిమానా విధించాలని సివిల్ సప్లై శాఖ సీఎండి ఆదేశాలు జారీ చేశారు.
మచిలీపట్నంలో నానికి చెందిన 4వేల మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగిన గోడౌన్‌ని 2020లో ప్రభుత్వం లీజుకు తీసుకుంది. తన గోడౌన్‌లో ఉన్న బియ్యంలో తరుగు వచ్చిందని గత నెల 27న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కి లేఖ రాశారు నాని.దాదాపుగా 3200 బస్తాల్లో తరుగు ఉన్నాయని..ఈ మేరకు తాను సొమ్మును చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు నాని.
Also Read: వంగవీటి రాధాకి ఎమ్మెల్సీ పదవి.. చంద్రబాబు నయా స్కెచ్
నాని లేఖ రాయడంతో గత నెల చివర్లో, ఈ నెల మొదటి వారంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 145 టన్నుల బియ్యం తగ్గినట్లు గుర్తించారు.వీటి విలువ సుమారు 89 లక్షల 72 వేల రూపాయలుగా గుర్తించారు.
మరోసారి పూర్తిస్థాయిలో గోడౌన్‌ను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని.. అప్పుడు కూడా ఇలాగే వస్తే జరిమానాతో పాటు గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు.