BigTV English

Simhachalam : సింహాద్రి అప్పన నిజరూప దర్శనం.. భక్తులకు ఇక్కట్లు.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం..

Simhachalam : సింహాద్రి అప్పన నిజరూప దర్శనం.. భక్తులకు ఇక్కట్లు.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం..

Simhachalam : విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వైశాఖ శుద్ధ తదియ రోజు అప్పన్నస్వామి నిజరూప దర్శనం ఇచ్చారు. దీంతో భారీగా భక్తులు తరలివచ్చారు. దేవాదాయశాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించారని మండిపడ్డారు.


మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. సామాన్యులకు త్వరగా దర్శనాలు కల్పించడంలేదని ఆరోపించారు. రూ.1500 టికెట్లు కొనుగోలు చేసినా త్వరగా దర్శనానికి పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇబ్బందులు తెలుసుకునేందుకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ క్యూలైన్‌ వద్దకు వెళ్లగా ఆయనను భక్తులు నిలదీశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. భక్తుల ఇబ్బందులపై దేవాదాయశాఖ అధికారులతో మంత్రి బొత్స మాట్లాడారు. దర్శనం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. క్యూలైన్లలో భక్తులను వేగంగా పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు.


సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. చందనోత్సవం రోజు ఇలాంటి పరిస్థితిని తొలిసారి చూశానని అన్నారు. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు.

మరోవైపు సింహాద్రి కొండపై అపచారం జరిగింది. ఓ ఆకతాయి అత్యుత్సాహంతో స్వామివారి నిజరూపాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. స్వామివారి నిజరూపాన్ని ఇలా బహిరంగ పరచడం అపచారం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో భద్రతా లోపాలపై మండిపడుతున్నారు. వాస్తవానికి అప్పన్న ఆలయంలో సెల్‏ఫోన్‏ వాడకం నిషేధం. భక్తులు ఆలయంలోకి ఫోన్లను తీసుకురావడానికి అనుమతి లేదు. కానీ స్వామివారి నిజరూపాన్ని వీడియో తీయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related News

CM Chandrababu: నేతలను దులిపేసిన సీఎం చంద్రబాబు.. సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్య

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

CM Chandrababu: పెద్దాపురంలో కలకలం.. చంద్రబాబు కాన్వాయ్ ఆపిన భూమి బాధితుడు!

Kotamreddy Sridharreddy: ఇది నాకొక పాఠం.. ఇకపై పెరోల్ కోసం ఎవ్వరికీ లేఖలు ఇవ్వను

Amaravati Central Library: అమరావతిలో హైటెక్ హంగుల లైబ్రరీ.. దీని స్పెషాలిటీ ఏమిటంటే?

TTD Treasury: వెంకన్న ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

Big Stories

×