
Virupaksha : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నెల 21న విడుదలైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడి చేస్తోంది. మొదటి రోజుకు మించి రెండో రోజు కలెక్షన్లు వచ్చాయి.
తొలిరోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్ వసూళ్లను ఈ మూవీ రాబట్టింది. రెండో రోజు రూ.5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను సాధించింది.
ఈ మూవీ విడుదలకు ముందే థియేట్రికల్ బిజినెస్ రూ.22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.23 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటికే రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే ఇంకా రూ.9.35 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విరూపాక్ష మూవీకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందించిన స్క్రీన్‌ప్లే ప్లస్ పాయింట్ అయ్యింది. అలాగే ఆయన శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో విజయం సాధించాడు. హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ తమ నటనతో మెప్పించారు. సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులకు కిక్కు ఇచ్చాయి. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఇలా అన్ని అంశాలు బాగా కుదరడంతో మెగా ఫ్యాన్స్ తోపాటు, సినీ అభిమానులు విరూపాక్షను ఆదరిస్తున్నారు. అందుకే భారీగా వసూళ్లు సాధిస్తోంది.