BigTV English

Tirumala News: తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ సైలెంట్, అది నిజమేనా?

Tirumala News: తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ సైలెంట్, అది నిజమేనా?

Tirumala News:  ఏడాది ఒక్కసారైనా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతారు. ఇందుకోసం ఆరు నెలల నుంచే ప్లాన్ చేసుకుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే కొంతైనా పాపాలు తొలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా. అందుకంటే కష్టపడి మరీ అక్కడికి వెళ్తారు.


నార్మల్‌గా తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. వేసవికాలం గురించి చెప్పనక్కర్లేదు. పిల్లలతో కలసి ఫ్యామిలీలు అక్కడికి వస్తాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లతో నిర్దేశిత సమయంలో రావాలని కోరింది. వారికి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లే ఛాన్స్ ఉందని టీటీడీ ఏఈవో వెంక‌య్య చౌద‌రి చెప్పారు.

పెరుగుతున్న భక్తుల రద్దీ


సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే రావాలని కోరారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమ‌ల‌లో విపరీతంగా భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి సర్వ దర్శనం క్యూ లైన్లను ప్రత్యక్ష్యంగా పరిశీలించారు.

భ‌క్తుల‌ కోసం చేసిన ఏర్పాట్లను త‌నిఖీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భ‌క్తుల‌కు అన్నప్రసాదాలు, మొబైల్ ఫుడ్ వెహిక‌ల్స్‌ను పరిశీలించారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రసాదాలు అందించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ALSO READ: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రమాదం

సోమవారం తిరుమల స్టేటస్

సోమవారం సర్వ దర్శనానికి దాదాపు 12 గంటలు పడుతోంది. భక్తులతో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సర్వ దర్శనం టోకెన్లను మధ్యాహ్నం శ్రీవారి మెట్టు ద్వారా నాలుగు విడతలుగా టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. మూడు గంటలకు- 474, ఐదు గంటలకు – 400, ఎనిమిది గంటలకు-1100, తొమ్మిది గంటలకు- 500 టోకెన్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే ఉదయం 6 గంటలకు రూ. 50 రూములకు 461, రూ 100 రూములకు సంబంధించి 891 ఉన్నట్లు తెలిపింది. మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం 20 గంటల వరకు సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సిఫార్సు లేఖల మాటేంటి?

రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు అందించే సిఫారసు లేఖల సహా ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సమాచారం ఇవ్వకుండా సిఫారసు లేఖలు తిరస్కరించడంతో సుదూర ప్రాంతాల నుంచి వాటితో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నార్మల్‌గా వేసవి సీజన్‌లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ సిఫారసు లేఖలను స్వీకరించదు. ప్రతీ ఏటా ఏప్రిల్‌ 15 నుంచి మూడు నెలలు సిఫారసు లేఖలను స్వీకరించదు. స్వయంగా వచ్చే వీఐపీ ప్రొటోకాల్‌ భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. లేఖల విషయంలో టీటీడీ క్లారిఫికేషన్ ఇస్తుందా? లేదా అన్నది చూడాలి. లేకుంటే ఆ లేఖలతో వచ్చే భక్తులు ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×