BigTV English

KPHB Crime: కూకట్ పల్లిలో దారుణం.. భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి.. పూడ్చిపెట్టిన భార్య

KPHB Crime: కూకట్ పల్లిలో దారుణం.. భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి.. పూడ్చిపెట్టిన భార్య

KPHB Crime: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు దాంపత్య బంధాలను కడతేర్చేలా చేస్తున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్నవాడిని, కడుపున పుట్టిన పిల్లలను చంపేందుకు కూడా వెనకాడట్లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా కూడా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నాయనడానికి ఈ వరుస ఘటనలే ఉదాహరణ.


వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కిరాతకంగా చంపేసింది ఓ భార్య. పైగా భర్త కనిపించకుండా పోయాడని చెప్పి అందరిని పిచ్చోళ్లని చేసింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లికి చెందిన కవిత, భర్త సాయిలు.. వివాహేతర సంబంధాల కారణంగా గత 15 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు.

ఇద్దరికి వివాహేతర సంబంధాలు ఉండటంతో నయంకాని రోగాలు వేదిస్తున్నాయి. ఇటీవలే మిత్రహిల్సా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా ఉద్యోగంలో చేరారు కవిత, సాయిలు. మళ్లీ ఇద్దరికి గొడవలు అవుతుండటంతో సాయిలు అడ్డు తలగించుకోవాలనుకునుంది కవిత.


పథకం ప్రకారమే ఆమె చెల్లెలు, చెల్లెలు భర్త మొత్తం ముగ్గురు కలసి సాయిల్‌కు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చెంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా సొంత గ్రామంలోనే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించింది కవిత. దీనిలో భాగంగా ఆటోను మాట్లాడుకుంది ఆ ప్లాన్‌ పేయిల్‌ అవ్వడంతో మిత్ర హిల్స్‌కు తీసుకొచ్చి పూడ్చిపెట్టారు నిందితులు.

విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను చంపిన రెండు రోజుల తర్వాత కవిత.. స్వగ్రామం పాత లింగయ్య పల్లి సర్పంచ్‌కు భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దలు గట్టిగా నిలదీయడంతో నిజం ఒప్పుకుంది కవిత. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఈ టార్చర్ నావల్ల కాదు.. అందుకే వెళ్లిపోతున్నా, యూపీలో టెక్కీ సూసైడ్

ఇదిలా ఉంటే.. కాళ్లు చేతులు కట్టేసి..! కళ్లల్లో కారం కొట్టి..! కిరాతకంగా హత్య చేశారు..! ఐతే ఇదేదో సూపారీ గ్యాంగ్‌ పని కాదు. కిరాయి గుండాలు అంతకంటే కాదు..! కట్టుకున్న భార్య, కన్నకూతురు చేసిన క్రూరత్వమిది. కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్యకేసులో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగానే ఆయన్ని హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. – కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. కర్నాటకలోని దండేలి భూముల విషయంలో వివాదం నడుస్తోంది. ఇదే విషయంపై భార్య పల్లవి HSR లేఔట్ పోలీస్ స్టేషన్‌లో మాజీ డీజీపీపై ఫిర్యాదు కూడా చేశారు.

ఐతే తన ఫిర్యాదును స్వీకరించడం లేదంటూ.. ఆమె ధర్నా కూడా చేశారు. దీనిపై తరుచూ వివాదం నడుస్తోంది. ఒకానొక సమయంలో భార్య, కూతురును గన్‌తో బెదిరించారు ఓం ప్రకాశ్‌. ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు.  ఓం ప్రకాశ్‌ బతికి ఉంటే తమను చంపేస్తాడని భావించిన తల్లీ కూతురు.. ఆయన్ని అడ్డు తొలగించాలని తల్లీ కూతురు ప్లాన్‌ చేసుకున్నారు. నిన్న బెంగళూరులోని ఇంట్లో తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేశారు. కళ్లల్లో కారం చల్లారు. కత్తితో పొడిచి చేసి కిరాతకంగా చంపేశారు. హత్య తర్వాత ఫ్రెండ్‌కి కాల్‌ చేసిన భార్య…రాక్షసుడిని చంపేశానంటూ చెప్పింది.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×