BigTV English

Cyclone Michaung: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్షసూచన

Cyclone Michaung: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్షసూచన

Cyclone Michaung: తమిళనాడుకు భారీ తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి వాయుగుండంగా మారి, రెండ్రోజుల్లో మరింత బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఎల్లుండి తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తిరువల్లూరు, కాంచీపురం, చెన్నైకి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు చెన్నై నీట మునిగింది.


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్ గా మారొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావడం లేదు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్.. అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో తీరం దాటుతాయి. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుపాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి.తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది రెండు తుఫాన్లు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. పసిఫిక్ సముద్రం మీదుగా వచ్చే తూర్పు గాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. గతంలో తూర్పుగాలుల ప్రభావం రాష్ట్రం వరకూ ఉండి.. మంచి వర్షాలు పడేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ఇటీవల కాలంలో తుఫాన్ల గమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల పెరుగుదల, కాలుష్యం అధికమవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. మిచౌంగ్‌ తుఫాన్ దిశ మార్చుకుంటే ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అవకాశాల్లేవు. అది ఉత్తరకోస్తా ప్రాంతంలో తీరం దాటితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి తుఫాన్ గా మారుతుందన్నారు. తర్వాత వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా మధ్యలో తీరానికి చేరువగా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా ప్రకారం తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతోంది. అది తుఫాన్ గా మారేందుకు సముద్రం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

.

.

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×