Big Stories

Himachal Pradesh news: గడ్డకట్టిన హిమాచల్.. పర్యాటకులకు కనువిందు

Himachal Pradesh latest update

Himachal Pradesh latest update(Today’s news in telugu):

హిమాచల్ ప్రదేశ్ గడ్డకట్టింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నో ఫాల్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూమతి మిగుల్చుతోంది. శీతాకాలం ప్రారంభంకాకవడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. భారీగా మంచువర్షం కురుస్తుండటంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి

- Advertisement -

మనాలి, సిమ్లా సహా అన్ని పర్యాటక ప్రాంతాలపై మంచు కురుస్తోంది. మనాలి పట్టణం సహా సోలాంగ్‌ నాలా, అటల్‌ టన్నెల్‌, రోహత్‌తంగ్‌ పాస్‌ చుట్టూ మంచు కురిసింది. హిమపాతం కారణంగా పలు దారులను సైతం మూసివేశారు. మరోవైపు ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు.. ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

సాధారణంగానే హిమాచల్ ప్రదేశ్ చల్లగా ఉంటుంది. ఇప్పుడు పర్వతాలలో మంచు కురుస్తున్న కారణంగా మరింత చల్లగా మారింది. గురువారం ఉదయం నుంచి సిమ్లా మేఘావృతమై ఉంది. హిమపాతాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిమ్లా నగరాన్ని 5 సెక్టార్‌లుగా విభజించింది. ప్రతి సెక్టార్‌లో SDM స్థాయి అధికారులను నియమించారు. ఆసుపత్రికి వెళ్లే రహదారులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మంచు కారణంగా పర్యాటకుల రాక పెరిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News