Cyclone Murasu Impact: వరుస తుఫాన్లు ఏపీని ఇబ్బంది పెడుతున్నాయి. అర్నబ్ తర్వాత మురసు కూడా ఉత్తరాంధ్ర మొదలు దక్షిణ ఏపీ ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఫలితంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం కూడా పలు రైళ్లు రద్దు అయ్యాయి.
వరుస తుఫాన్లు ఏపీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. అర్నబ్ దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందు మురసు కూడా బీభత్సం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని కలిగింది. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురు గాలులు కారణంగా తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ఈ మూడు జిల్లాల్లో చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, రైల్వే ట్రాక్‌లపై వరద నీరు నిలిచిపోవడం వంటివి చోటు చేసుకున్నారు.
మురసు తుఫాను పరీక్షించి దక్షిణ మధ్య రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వేలు బుధవారం కూడా పలు రైళ్లు చేశారు. వాటిలో తెనాలి- గుంటూరు పాసింజర్ (67236), రేపల్లె- మార్కాపురం (67238), మార్కాపురం -తెనాలి(67239) మధ్య పాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి -నర్సాపూర్(17256), సికింద్రాబాద్ -తిరుపతి(12732 ) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రీషెడ్యూల్ చేసిన 22705 తిరుపతి-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు 4 నవంబర్ 5 గంటలకు బయలుదేరుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే మంగళవారం రాత్రి 21.10 గంటలకు బయలుదేరాలి.
ALSO READ: చరిత్ర సృష్టించిన జనసేన.. పురపోరులో మళ్లీ 100 శాతం స్ట్రైక్ రేటు, జనసైనికులు ఫుల్ ఎంజాయ్
రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలిచిపోవడం, విద్యుత్తు వైర్లు తెగిపడడంతో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు అధికారులు. దీంతో ఆయా మార్గాల్లో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తు్న్నాయి. చెన్నై నుంచి వచ్చే పలు రైళ్లను కొన్ని దారి మళ్లించగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. స్టేషన్ కు దూరంగా రైళ్లు నిలిపివేయడంతో తాగునీరు, ఆహారం లేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Important Train Related information: Cancellation of trains due to Cyclonic storm.@SCRailwayIndia@drmvijayawada@DRMVSKPSCoR@drmgnt@drmgtl pic.twitter.com/DOtHZkJ9mU
— SOUTH COAST RAILWAY – SCoR (@SCoRAILWAYVSKP) November 3, 2026
In view of Cyclone ‘MURASU’, South Central Railway announces the cancellation and rescheduling of select train services, along with the restoration of Train No. 16093 to its normal route.
Passengers are advised to take note of the changes and plan their journeys accordingly.… pic.twitter.com/ABWF6WKP0u
— South Central Railway (@SCRailwayIndia) November 3, 2026