Janasena: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ పోటీ చేసిన కార్పొరేషన్లు, మున్సిపాటిలీ, నగర పంచాయతీ పీఠాలను దక్కించుకుంది. అటు అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల మాదిరిగానే 100 శాతం ఫలితాలను సొంతం చేసుకుంది. దీంతో జన సైనికులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు.
ఏపీలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నిక ఫలితాల్లో జనసేన జైత్రయాత్ర కంటిన్యూ చేస్తోంది. ఆ పార్టీ ఎంపిక చేసుకున్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ పీఠాలను దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ 100 శాతం స్ట్రైక్ రేటు సాధించింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేటు సాధించింది. ఆ రికార్డు మాదిరిగానే పురపోరు ఫలితాలు వచ్చాయి. దీంతో అధినేత పవన్ కల్యాణ్ మొదలు మిగతా నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
కూటమి పార్టీల పొత్తుల భాగంగా జనసేన పార్టీ కార్పొరేషన్లు-4, మున్సిపాలిటీలు-18, నగర పంచాయతీలు-3 దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు-2, మున్సిపాలిటీలు-15, నగర పంచాయతీలు-3 అన్నింటిలోనూ గెలుపు సాధించింది. విజయవాడ, ఏలూరు మేయర్ల పీఠాల్లో జనసేన విజయం సాధించింది. పెండింగ్‌లో వాటికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
ఆ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల పోటీ చేయడంతోపాటు కొన్ని కొత్త నియోజకవర్గాలకు నాయకత్వాన్ని విస్తరించేలా అడుగులు వేసింది జనసేన. పిఠాపురం, తెనాలి, పాలకొండ, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, కాకినాడ వంటి చోట మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా సీట్లను దక్కించుకుని మరింత బలపడింది.
ప్రధాన నగరాలు విజయవాడలో జనసేనకు ఎలాంటి బలం లేదు. మేయర్ సీటు గెలుపొందడం ద్వారా అక్కడ బలం సాధించింది. ఏలూరు కార్పొరేషన్, శ్రీకాకుళం కార్పొరేషన్ సీట్లు తీసుకుని పార్టీని విస్తరించే ప్రయత్నం చేసింది. తుని, సామర్లకోట, దర్శి, తిరువూరు, చిలకలూరిపేట, ముమ్మిడివరం, అమలాపురం, పెడన, మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు మున్సిపాలిటీలను గెలవడం ద్వారా పార్టీని విస్తరించేలా చేసింది. కొన్ని స్థానాల్లో టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన అవకాశం కల్పించడం 100 శాతం విజయం సాధించడానికి కీలకమైంది.
ALSO READ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రత.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్లారిటీ!
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జనసేన అభ్యర్థుల్లో చాలామందికి ఆర్థిక బలం లేదు. పార్టీ పెద్దల నుంచి సాయం అందడం కూడా కలిసి వచ్చింది. కేవలం పురపోరులో 100 శాతం గెలుపు వెనుక దాదాపు అరడజను కారణాలు ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు కూడా.
100% Strike rate Again !
3/3 Nagar Panchayat chairmans ✅
2/2 Mayors ✅
15/15 Municipal Chairmans ✅#JanaSenaStrikesAgain pic.twitter.com/17AoedLLUU— JanaSena Party (@JanaSenaParty) November 3, 2026