E-Paper
Advertisement

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రత.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్లారిటీ!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రత.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్లారిటీ!
Advertisement

AP Elections: ఎపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఎర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోత్తం రాష్ట్రంలో 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఎర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 40,679 మంది పోలీస్ సిబ్బంది ఉండనున్నారు.

అదనపు బలగాలు..

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామని అధికారి తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపుతో అదనపు బలగాల మోహరింపు చేశారు. 3488 రూట్ మొబైల్స్‌తో నిరంతర పర్యవేక్షణ ఉంటుదని డీజీపీ క్లారిటీ ఇచ్చారు. 931 స్ట్రైకింగ్ ఫోర్స్, 847 ఎస్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో 412 చెక్‌పోస్టులు, 847 ఎస్‌ఎస్‌టీ బృందాలతో తనిఖీలకోసం ప్రత్యేకంగా ఎర్పాటు చేశారు. 547 పికెట్ కేంద్రాల వద్ద 1,381 మంది సిబ్బందితో భద్రత. ఎన్నికల విధుల్లో పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాల సమన్వయం చేసుకోనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎన్నికల భద్రతపై పర్యవేక్షణ చేయనున్నారు.

భారీగా నిఘాలు..

Advertisement

సీసీటీవీ, డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు, వీడియో ఫుటేజ్‌తో నిఘాలో ఉంచామని, సమర్థ యాప్ ద్వారా పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణపై పర్యవేక్షణ చేస్తామని డీజీపీ హరష్ కుమార్ గుప్తా అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టామని, ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సుల భద్రతకు 178 స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర పోలీస్ పహారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని అన్నారు.

Also read: ఢిల్లీ స్టార్ హోటల్ లాబీలో రచ్చకెక్కిన హస్తం పొలిటిక్స్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి?

Tags

Related News

కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!

జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!

20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు

రేషన్ పంపిణీపై తప్పుడు ప్రచారం.. అలాంటివి నమ్మవద్దు, అధికారులు కీలక ప్రకటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నగరాలు-పట్టణాల్లో కూటమి జోరు, పత్తా లేని వైసీపీ

రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

Big Stories

Advertisement
×