E-Paper
Advertisement

స్థానిక ఫలితాలపై జగన్ రియాక్ట్.. జరిగినవి ఎన్నికలు కావు, ఎంపికలు మాత్రమే

స్థానిక ఫలితాలపై జగన్ రియాక్ట్..  జరిగినవి ఎన్నికలు కావు, ఎంపికలు మాత్రమే
Advertisement

Jagan React: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. మా పార్టీ ఓటమి వెనుక తప్పును ప్రభుత్వంపైకి నెట్టేశారు. ఎన్నికలను ప్రతీ దశలోనూ హైజాక్ చేశారంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అధినేత చేసిన కామెంట్స్ చూసి నేతలు సైలెంట్ అయ్యారు.

స్థానిక ఫలితాలపై జగన్ రియాక్ట్

రాజకీయ నేతల మాటలు కత్తి మాదిరిగా రెండు వైపులా మాట్లాడుతారు. సమయం, సందర్భం బట్టి మారిపోతారు. జగన్ కూడా అదే చేశారు. మొన్నటి వరకు ఈవీఎం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ ఓటమి పాలైందని ఒకటే గోల పెట్టారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు.  ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరిగాయి. వైసీపీ ఎందుకు ఓడిపోయినట్టు? అందుకు ఈసారి కొత్త పల్లవిని ఎత్తుకున్నారు మాజీ సీఎం జగన్.

Advertisement

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై నోరు విప్పారు వైసీపీ అధినేత జగన్. కూటిమి ప్రభంజనపై ఆయన ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వానికి, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేశారని, ఎన్నికల్లో ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారని రాసుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారని ప్రస్తావించారు.

జరిగినవి ఎన్నికలు కావు, ఎంపికలు మాత్రమే

నామినేషన్లు మొదలు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌ ఏజెంట్ల వరకు అందరినీ అడ్డుకున్నారని, బలవంతంగా బయటకు లాగేసి హైజాక్ చేశారని చెప్పుకొచ్చారు. పోలింగ్‌‌ను రిగ్గింగ్‌ చేశారని, పోలింగ్‌ శాతం తారుమారు అయ్యిందన్నారు. చివరకు ఓట్ల లెక్కింపును హైజాక్‌ చేశారంటూ మనసులోని మాటను బయటపెట్టారు. అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు, ప్రజలు వారిని ఎన్నుకోలేదన్నారు. అందుకే ఇవి ఇక ఎన్నికలు కావని, ఎంపికలు మాత్రమేనని తేల్చేశారు. ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదని పేర్కొన్నారు.

Advertisement

ALSO READ: రైల్వే ప్రయాణికులకు గమనిక.. మురసు తుఫాన్ ఎఫెక్ట్, బుధవారం పలు రైళ్లు రద్దు

నిజానికి ఈ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చేది. కనీసం మేయర్, కార్పొరేషన్లను ఒకవంతు గెలుచుకునేది. అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీ జార విడుచుకుంది. కూటమిలో నామినేషన్ల ఉపసంహరణ వరకు అభ్యర్థులు ఎవరో తేలని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతీ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి నిమిషంలో చాలామంది డ్రాప్ కాలేదు. చాలా స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ అవకాశాన్ని వైసీపీ జార విరుచుకుంది. ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని నేతలకు ఖరాఖండిగా చెప్పేశారు.

అలాంటప్పుడు పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తే విజయం సాధించేవారు. ఆ వ్యవహారానికి దూరంగా బెంగుళూరుకు వెళ్లిపోయారు. చాలామంది అభ్యర్థులు ఖర్చుకు వెనకాడారు. అనంతపురం జిల్లా కార్పొరేషన్ గెలుపు మీద జగన్ ఏమంటారు? అక్కడ కూడా హైజాక్ చేశారా? అంటూ ప్రత్యర్థులు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఏపీలోని అన్నింటికంటే నెల్లూరులో వైసీపీ బలంగా ఉందని భావిస్తుంటారు. ఫలితాల రోజు వైసీపీ మేయర్ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని, ఈ విధంగా జరుగుతాయని తాము ఎన్నడూ ఊహించలేదన్నారు. ఆయన మాటలపై వైసీపీ అధినేత ఎలాంటి సమాచారం చెబుతారు? అన్నదే అసలు ప్రశ్న. తన ఓటమిని ప్రత్యర్థులపై నెట్టేశారు మాజీ సీఎం.

 

 

Related News

రైల్వే ప్రయాణికులకు గమనిక.. మురసు తుఫాన్ ఎఫెక్ట్, బుధవారం పలు రైళ్లు రద్దు

చరిత్ర సృష్టించిన జనసేన.. పురపోరులో మళ్లీ 100 శాతం స్ట్రైక్ రేటు, జనసైనికులు ఫుల్ ఎంజాయ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రత.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్లారిటీ!

కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!

జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!

20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు

Big Stories

Advertisement
×