E-Paper
Advertisement

కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!

కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!
Advertisement

AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వ ఆధిపత్యం చెలాయిస్తోంది. మెుత్తం 13 కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా.. అందులో మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చిత్తూరు ఉన్నాయి. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే పోలింగ్ జరిగిన 87 మున్సిపాలిటిల్లో కూటమి 60 గెలుచుకుంది. మరో 20 మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వైసీపీ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించగా.. రెండింటిలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇతరులు ఒక కార్పొరేషన్ లో విజయం సాధించగా.. రెండింటిలో లీడ్ లో ఉన్నారు.

గుంటూరు మేయర్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని లక్ష్మీ అపర్ణ విజయం సాధించారు. మెుత్తం 76 డివిజన్లకు గాను టీడీపీ 27, జనసేన 7, బీజేపీ 3, వైసీపీ 3, ఇతరులు ఒక దానిలో విజయం సాధించారు. మెుత్తంగా 37 డివిజిన్లలో కూటమి విజయం సాధించగా.. మరో 25 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. మరోవైపు తిరుపతి మేయర్ గా టీడీపీ అభ్యర్థి శ్రీనివాస ప్రసాద్ జయకేతనం ఎగురవేశారు. అక్కడ మెుత్తం 66 స్థానాలకు గానూ టీడీపీ 38, జనసేన 19, బీజేపీ 19, వైసీపీ 3, ఇతరులు 3 డివిజిన్లలో విజయం సాధించారు.

Advertisement

Also Read: రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

అటు చిత్తూరు కార్పొరేషన్ ను సైతం కూటమి దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థి కఠారి హేమలత మేయర్ గా విజయం సాధించారు. 60 స్థానాలకు గాను టీడీపీ 51, జనసేన 2, భాజపా 1, వైకాపా 4, ఇతరులు 1 డివిజన్ లో గెలిచారు. అటు మచిలీపట్నం మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అబిదా కైవసం చేసుకున్నారు. గెలుపు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మచిలీ పట్నంలో వార్ వన్ సైడెడ్ గా సాగిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

మరోవైపు వైసీపీ అభ్యర్థులు సైతం పలు చోట్ల విజయ కేతనం ఎగురవేశారు. నాయుడుపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైసీపీ అభ్యర్థిని తంబిరెడ్డి రాజేశ్వరమ్మ కైవసం చేసుకున్నారు. డోన్ మున్సిపాలిటీల్లో 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. నందికొట్కూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం సైతం జగన్ పార్టీకి దక్కింది. 2,634 ఓట్లతో వైఎస్సార్‌సీపీ ఛైర్మన్ అభ్యర్థి షేక్‌ ఫాతిమా విజయం‌ సాధించారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లోనూ పలువురు వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. మచిలీపట్నంలోనూ 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Also Read: క్రిస్మస్‌ వేళ కుప్పకూలే పరిస్థితుల్లో కుటుంబం… పెంపుడు కుక్క చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యా

Tags

Related News

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భారీ భద్రత.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్లారిటీ!

జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!

20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. కావలి వద్ద నిలిచిన రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు

రేషన్ పంపిణీపై తప్పుడు ప్రచారం.. అలాంటివి నమ్మవద్దు, అధికారులు కీలక ప్రకటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నగరాలు-పట్టణాల్లో కూటమి జోరు, పత్తా లేని వైసీపీ

రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

Big Stories

Advertisement
×