Madhavi Latha.. ప్రముఖ సినీనటి మాధవి లత (MadhaviLatha) పై తాజాగా తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. తాడపత్రి మహిళలను కించపరిచేలా ఆమె మాట్లాడారని.. ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ (Kamalamma) ఫిర్యాదు చేశారు. ఇక ఆమె ఫిర్యాదు మేరకు నటి మాధవి లతపై కేసు ఫైల్ చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం విని మాధవి లత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని.. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో “మహిళలకు మాత్రమే” అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC . Prabhakar Reddy) ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై మాధవి లతా స్పందిస్తూ.. “ఇలాంటి వేడుకలకు మహిళలు వెళ్లకూడదు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ వారికి ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారు. జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దు” అని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా ఆమెపై మండిపడ్డారు. ఆమెపై పరుష వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ముఖ్యంగా తెరమీద కనిపించే వాళ్ళందరూ వ్యభిచారులే అంటూ జేసి కామెంట్లు చేయడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చిన మాధవి లత..
దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఫిలిం ఛాంబర్ తో పాటు మానవ హక్కుల సంఘానికి అలాగే పోలీసులకు మాధవి లత ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద చాలా దారుణంగా మాట్లాడారని, తన మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA ) కు ఫిర్యాదు చేశానని , మా ట్రెజరర్ శివ బాలాజీ(Siva Balaji) కి కాల్ చేస్తే వెంటనే స్పందించారని ఆమె తెలిపింది. ఇక తన ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు (Manchu Vishnu) దృష్టికి కూడా తీసుకెళ్లారని, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్లు సత్తా చాటుతున్నారు. కానీ వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్ళపై రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అంటూ మాధవి లత తెలిపింది.
క్షమాపణలు చెప్పిన జేసీ..
ఇక తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. “ఆవేశంలో నోరు జారాను.. సారీ” అని తెలిపారు .అయితే క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి లత కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో వదిలింది. మహిళల మాన,ప్రాణ, రక్షణ గురించి మాట్లాడితే.. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మామూలుగా ఉందామని ప్రయత్నించినా తన వల్ల కాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమెపై కేసు ఫైల్ అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రివేంజ్ తీర్చుకున్నారా..?
మొత్తానికి అయితే మాధవి లత జెసి ప్రభాకర్ రెడ్డి పై కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా ఆయన రివేంజ్ తీర్చుకున్నారేమో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Bandla Ganesh : ఆ బంధం అద్దె ఇల్లు లాంటిది… పవన్‌పై సెటైరా…? వైరల్ అవుతున్న బండ్ల ట్వీట్