Vijayawada: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా ఉత్సవాలు-2025కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది దేవస్థానం. పోస్టర్ తోపాటు నవరాత్రుల ఏయే రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు అనే వివరాలను వెల్లడించింది. అయితే ఈసారి 11 రోజులపాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అమ్మవారిని ఆయా రోజుల్లో లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఆలయ సిబ్బంది రెండునెలలు ముందుగానే ఏర్పాట్లు నిమగ్నం అవుతుంది. తాజాగా బెజవాడ కనకదుర్గ ఆలయంలో ఈ ఏడాది సెప్టెంబర్ 22 దసరా మహోత్సవాలు మొదలుకానున్నాయి. అక్టోబర్ రెండు వరకు కంటిన్యూ జరుగుతున్నాయి.
ఈ ఏడాది 11 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. అయితే అమ్మవారికి పట్టువస్త్రాలను సెప్టెంబర్ 29న సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన పూజారి వెల్లడించారు. సామాన్యులకు పెద్ద పీట వేస్తూ దుర్గమ్మ దర్శనం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆలయ ఈవో శీనా నాయక్.
అక్టోబర్ 2న అనగా గురువారం విజయదశమి రోజు ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరగనుంది. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటామన్నారు. 11 రోజులు ప్రతి రోజు సాయంత్రం నగరోత్సవాలు నిర్వహించనున్నారు.
ALSO READ: ఖైరతాబాద్ గణేషుడికి పోటీ.. లక్ష చీరలతో లంబోదరుడు,
22న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దుర్గామాత భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 23న శ్రీ గాయత్రిదేవిగా, 24న శ్రీ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. 25న శ్రీ కాత్యాయినిదేవి , 26న శ్రీ మహా లక్మీ దేవి అలంకారం దర్శనం ఇవ్వనున్నారు.
27న శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి, 28న శ్రీమహా చండీదేవి 29న మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవిగా భక్తులను కనువిందు చేయనున్నారు. 30న శ్రీ దుర్గా దేవి అలంకారం, అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషాసుర మర్దిగా, రెండున అనగా విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కనువిందు చేయనున్నారు. ఈ 11 రోజులు అమ్మవారు ఆయా రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ సమయంలో అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తారని ఈవో తెలిపారు.