Ganesh Idol: ప్రధమ పూజ్యుడు వినాయకుడు ఉత్సవానికి రెడీ అవుతున్నాయి నగరాలు. కేవలం నెలరోజులు మాత్రమే సమయం మిగిలివుంది. వివిధ నగరాలు వినాయకుడ్ని ముస్తాబులో నిమగ్నమయ్యాయి. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి పోటీగా ఏపీలో వెరైటీగా లంబోదరుడ్ని రెడీ చేస్తున్నారు. కేవలం లక్ష చీరలతో గణేషుడ్ని రెడీ చేస్తున్నారు? అదెలా అనుకుంటున్నారా?
అడ్డంకులను తొలగించే దేవుడిగా వినాయకుడు నమ్ముతారు.. పూజిస్తారు. అంతేకాదు వినాయక చవితి తర్వాత మిగతా పండుగలు వస్తాయి. వినాయకుడ్ని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే కొత్త పనులకు అధిపతిగా భావిస్తారు.
ఎప్పటి మాదిరిగా ఈసారి విశాఖలో వెరైటీగా వినాయకుడ్ని రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. పారిశ్రామిక ప్రాంతం గాజువాక లంక గ్రౌండ్లో 90 అడుగుల భారీ వినాయకుడు రెడీ చేస్తున్నారు. వారం కిందట పనులు మొదలయ్యాయి. ఆరునెలల ముందే విగ్రహం పనులు మొదలుపెడతారు. అయితే ఈసారి వెరైటీగా విశాఖలో గణేషుడ్ని రెడీ చేస్తున్నారు. కేవలం లక్ష చీరలతో గణనాథుడు కొలువుదీరనున్నాడు.
ఈసారి ‘శ్రీ సుందర వస్త్ర మహా గణేశ’ పేరుతో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మట్టి లేకుండా కేవలం చీరలతో అన్నమాట. ముంబై, చెన్నై, సూరత్ నగరాల నుంచి సేకరించిన చీరలతో అందంగా ముస్తాబు అవుతున్నాడు మహా గణపతి. తొలుత రెండు లేదా మూడు రకాల ఫుడ్ ఐటెమ్స్ గణేషుడ్ని తయారు చేయాలని భావించారు.
ALSO READ: సింగపూర్‌లో తెలుగు రెండో భాష? సీఎం చంద్రబాబు పిలుపు
ఎక్కువ రోజులు ఉండవని భావించి చీరలతో రెడీ చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవం ఆగస్టు 27న మొదటి పూజ జరుగుతుంది. సెప్టెంబర్ 18న భారీ ఎత్తున నిమజ్జనం కార్యక్రమం చేయనున్నారు. అలాగే టన్ను పసుపు, టన్ను కుంకుమ, టన్ను విభూతి, టన్ను పువ్వులతో స్వామి అభిషేకానికి ఉపయోగించనున్నారు. నిమజ్జనానికి 5 టన్నుల లడ్డూను ఉపయోగించనున్నారు.
పూజలో ఉన్న చీరలను ఈసారి భక్తులకు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నమాట. దేశంలో చీరలతో గణేష్ విగ్రహాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది గాజువాకకు గర్వకారణం మాత్రమే కాదని, పర్యావరణ అనుకూల వేడుకల వైపు ఓ అడుగు పడుతుందని అంటున్నారు.
ఈ ఏడాది గణేశుడు కూర్చున్న భంగిమలో 90 అడుగుల ఎత్తుకు ఉండవచ్చని చెబుతున్నారు. వినాయకుడికి రెండువైపులా ప్రతిరూపాలు ఉంటాయి. ఎడమ వైపు శ్రీ లక్ష్మీ నారాయణ, కుడి వైపు శ్రీ కృష్ణుడు కొలువుదీరనున్నారు. 25 మంది కళాకారుల బృందానికి చీరాలకు చెందిన ప్రఖ్యాత కళాకారుడు శ్రీకాంత్ నేతృత్వంలో ఆ పనులు జరుగుతున్నాయి.
దాదాపు 40 శాతం పని పూర్తయింది. సంప్రదాయం ప్రకారం వేడుకల సమయంలో తాపేశ్వరం నుండి మహా లడ్డూను దేవతకు సమర్పిస్తారు. ఖైరతాబాద్ విగ్రహానికి పోటీగా ఈసారి గాజువాక గణేషుడు రెడీ అవుతున్నాడని అంటున్నారు. విశాఖ సిటీలో గాజువాక ప్రాంతం వినూత్నమైన గణేష్ విగ్రహాలకు ఖ్యాతిని సంపాదించింది. ఇప్పటివరకు ఎత్తైన 117 అడుగుల గణేష్ విగ్రహం రికార్డు కలిగి ఉంది.