Rice Flour For Skin: ముఖం అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం నిత్యం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇందుకోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. రసాయనాలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. ముఖ్యంగా బియ్యం పిండితో తయారు చేసిన హోం రెమెడీస్ సహజ మెరుపును అందిస్తాయి. అంతే కాకుండా మొటిమలు, మచ్చలను కూడా నివారిస్తాయి. ఇంతకీ మెరిసే చర్మం కోసం బియ్యం పిండిని ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండితో చర్మానికి కలిగే ప్రయోజనాలు :
ఎక్స్‌ఫోలియేషన్: బియ్యం పిండిలో ఉండే చిన్నపాటి రేణువులు చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి.
చర్మాన్ని కాంతివంతం చేయడం: ఇందులో ఉండే కొన్ని ఎంజైమ్‌లు, పిండి పదార్థాలు చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అధిక నూనెను నియంత్రించడం: జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇది చర్మం నుంచి అదనపు నూనెను పీల్చుకుంటుంది.
యాంటీ ఏజింగ్: బియ్యం పిండిలో ఫెరూలిక్ యాసిడ్ , అల్లియంటోయిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గించి.. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
సన్ టాన్ తొలగింపు: సూర్యరశ్మి వల్ల ఏర్పడిన నల్లదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
బియ్యం పిండితో ఫేస్ ప్యాక్‌లు:
1. బియ్యం పిండి, పాలు/పెరుగు ప్యాక్ (పొడి, సాధారణ చర్మానికి):
కావలసినవి:
2 టేబుల్‌స్పూన్లు- బియ్యం పిండి
తగినంత- పచ్చి పాలు లేదా పెరుగు.
వాడే విధానం: బియ్యం పిండి పాలు లేదా పెరుగు వేసి పేస్ట్ లాగా కలపండి. ఈ పేస్ట్‌ను శుభ్రమైన ముఖానికి, మెడకు అప్లై చేయండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో సున్నితంగా రుద్దుతూ కడిగేయండి.
ప్రయోజనం: పాలు చర్మాన్ని మృదువుగా.. తేమగా ఉంచుతాయి, బియ్యం పిండితో కలిసి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
2. బియ్యం పిండి, నిమ్మరసం ప్యాక్ (జిడ్డు చర్మానికి):
కావలసినవి:
2 టేబుల్‌స్పూన్లు- బియ్యం పిండి
1 టేబుల్‌స్పూన్- నిమ్మరసం
కొద్దిగా రోజ్ వాటర్ (అవసరమైతే).
తయారీ, వాడే విధానం: బియ్యం పిండిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇది చాలా చిక్కగా అనిపిస్తే.. కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనం: నిమ్మరసం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా జిడ్డును తగ్గిస్తుంది. బియ్యం పిండి అధిక నూనెను పీల్చుకుంటుంది.
3. బియ్యప్పిండి, తేనె ప్యాక్ (అన్ని రకాల చర్మానికి):
కావలసినవి:
2 టేబుల్‌స్పూన్లు- బియ్యం పిండి
1 టేబుల్‌స్పూన్- తేనె
కొద్దిగా నీరు లేదా పాలు.
తయారీ, వాడే విధానం: బియ్యం పిండి, తేనె, తగినంత నీరు/పాలు కలిపి పేస్ట్ చేయండి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనం: తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
Also Read: గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా ?
ముఖ్య గమనికలు:
ఏ ప్యాక్‌ను అయినా ఉపయోగించే ముందు.. మీ చర్మంపై (ఉదాహరణకు, చెవి వెనుక) ప్యాచ్ టెస్ట్ చేయండి.
ఈ ప్యాక్‌లను వారానికి 1-2 సార్లు కూడా ఉపయోగించవచ్చు.
బియ్యప్పిండిని గ్రైండర్‌లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు.
మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా ఉపయోగించండి.