E-Paper
Advertisement

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఆ జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఆ జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్
Advertisement

Weather News: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. సోమవారం మధ్యాహ్నానానికి పారాదీప్-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణల్లోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం- బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. చాంద్‌బలి-కానింగ్‌ మధ్య తీరం దాటవచ్చని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, పోలవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఆ జోరు-వాయుగుండం నేపథ్యంలో ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మాట. వాయుగుండం నేపథ్యంలో సముద్రంలో అలజడి ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. మూడు రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన-ముఖ్యంగా చిన్న పడవలతో వేటకు వెళ్లొద్దని, ఏడు మీటర్ల కన్నా పెద్ద పడవలతో వేటకు వెళ్లడం సురక్షితమైన సూచించింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ విషయంలో ప్రజలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Advertisement

తెలంగాణలో వర్ష సూచన- తెలంగాణ వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లాలోని జగ్గాసాగర్‌లో అత్యధికంగా 76.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో సిర్గాపూర్‌- 51.0, కంది- 42.5, కడ్పాల్‌- 41.3, కామారెడ్డి జిల్లా మచ్చాపూర్‌-40.8మి.మీ. వర్షం కురిసినట్టు పేర్కొంది.

ALSO READ: మడ అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రికార్డు.. అటవీ శాఖకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ఆగష్టు ఒకటి వరకు – నేడు, రేపు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా వేసింది. హైదరాబాద్ సిటీలో ప్రజలు సాయంత్రం వేళ భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీసుల నుంచి ముందుగా ఇంటికి బయలు దేరేలా ప్లాన్ చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు ఏ మాత్రం తగ్గినట్టు కనిపించలేదు. తెలంగాణలో 34 డిగ్రీలు, ఏపీలో 35 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుంది. ఉత్తర తెలంగాణలో 70 శాతం తేమ ఉండగా, దక్షిణ తెలంగాణలో 55 శాతం ఉన్నట్లు పేర్కొంది.

 

Related News

కర్నూలులో రాత్రి హైటెన్షన్.. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు.. భయాందోళనలో స్థానికులు

రోజాకు పోలీసులు నోటీసులు.. షాకైన వైసీపీ నేతలు, బెదిరింపులకు భయపడేది లేదు-రోజా

మడ అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రికార్డు.. అటవీ శాఖకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!

తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!

పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

Big Stories

Advertisement
×