BigTV English

Pawankalyan comments on Jagan: జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్, ఒక్క ఓటమితో..

Pawankalyan comments on Jagan: జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్, ఒక్క ఓటమితో..

Pawankalyan comments on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. సీఎంగా పనిచేసిన వ్యక్తి.. ఒక్క ఓటమితో అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్లిపోయారన్నారు. ఓటమి.. మనిషిని అలా భయపెడుతుందన్నారు. అలాగైతే జనసేన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. మనలాగే దెబ్బలు తింటే కనీసం 15 రోజులు కూడా పార్టీ నడిపేవారా అనిపించిందన్నారు.


మంగళగిరిలో సోమవారం పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్కరించారు. వైసీపీ సహా ఏ పార్టీ వారైనా ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కాదన్నారు. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిదికాదన్నారు. చట్టం ప్రకారమే వారిని శిక్షిద్దామన్నారు. జన బలం ఉండి, ఒక్క సీటు గెలుచుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం 100 శాతం గెలిచామన్నారు. వ్యక్తిగత దూషణకు దూరంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు.

175 సీట్లతో పోల్చితే 21 సీట్లు పెద్ద సంఖ్య కాదన్నారు పవన్ కల్యాణ్. కూటమి 164 సీట్లు గెలవడానికి, మనం తీసుకున్న 21 సీట్లు వెన్నుముకగా నిలిచిందన్నారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెట్టాలంటే చాలా మంది భయపడేవారని, అభిప్రాయం చెప్పాలన్నా నోరు విప్పేవారు కాదన్నారు. బూతులు తిట్టడం, అందరినీ భయపెట్టడం, కేసులు, క్యారెక్టర్‌ని చంపేయడం కాదన్నారు.


అప్పటి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో బంధించి మరీ గుంటూరు తీసు కొచ్చారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. కస్టడీలో ఆయనను కొట్టిన తీరు దారుణమన్నారు. అంతేకాదు నాలుగు దశాబ్దాలుగా పని చేసిన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును జైలులో పెట్టించారన్నారు.

Also read: వైసీపీలో పొగ పెడుతున్నారా? రాజీనామా బాటలో బాలినేని?

ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మందికి వెన్నుదన్నుగా జనసేన నిలిచిందన్నారు పవన్. రోడ్ల మీదకు రావాలంటే ఒకప్పుడు భయపడేవాళ్లమని, ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నూరి పోశామన్నారు. బాధ్యతలు మోసే ప్రతీ ఒక్కరికీ తాను అండగా ఉంటానన్నారు. పనిలోపనిగా కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించా రు జనసేనాని. మనకు సంస్కారం కావాలని, రౌడీయిజంతో భ‌య‌పెట్టాల‌ని చూస్తే వదులుకునేందుకు సిద్ధమన్నారు జనసేనాని. నా మాటలను మంచి మనసుతో అర్థం చేసుకోవాలన్నారు. మహిళా నేతలను సోషల్‌మీడియాలో కించపరిచినా యాక్షన్ తప్పదన్నారు.

ఇప్పటివరకు ప్రధాని నరేంద్రమోదీని తాను ఏమీ అడగలేదని, ఐదు కోట్ల మంది కోసం ఇకపై అడుగుతాన న్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. స్టీల్‌ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాలపై మాట్లాడుతానన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకంకాదని, నాయకులు తమ వారసుల్ని బలవంతంగా ప్రజలపై రుద్దకూడదన్నారు. కొత్త తరం రాజకీయ నాయకులకు మనం వేదిక కావాలన్నారు.

అనంత్ అంబానీ పెళ్లికి వెళితే అందరూ కూటమి విజయం గురించే మాట్లాడారన్నారు పవన్ కల్యాణ్. కూటమి విజయానికి జనసేన తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. తాను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదన్నారు. పోటీ  చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచామని, ఇది దేశంలోనే ఒక కేస్ స్టడీ అవుతుందన్నారు.

Tags

Related News

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Amaravati ORR: అమరావతి ORRకు వేగం.. భూసేకరణ మొదలు.. ఆ నగరాలకు పండగే!

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

Anantapur News: దగ్గుపాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. ముట్టడికి జూనియర్ ఫ్యాన్స్, చెదరగొట్టిన పోలీసులు

Vangaveeti Statue: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు దొరికాడు, వెనుక ఎవరున్నారు?

Big Stories

×