BigTV English

Sarfira Movie: సినిమా చూస్తే చాయ్ సమోసా ఫ్రీ.. ప్రేక్షకుల కోసం థియేటర్ వింత ఆఫర్!

బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సరిఫిరా’ జూన్ 12 విడుదలైంది. ఈ సినిమా థియేటర్‌లో చూడడానికి ప్రేక్షకులు రావడం లేదు. తమిళంలో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలసిందే. సూరరై పొట్రు హిందీ రీమేక్‌గా ‘సరఫిరా’ విడుదలైంది.

Sarfira Movie: సినిమా చూస్తే చాయ్ సమోసా ఫ్రీ.. ప్రేక్షకుల కోసం థియేటర్ వింత ఆఫర్!

Sarfira Movie| బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సరిఫిరా’ జూన్ 12 విడుదలైంది. ఈ సినిమా థియేటర్‌లో చూడడానికి ప్రేక్షకులు రావడం లేదు. తమిళంలో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలసిందే. సూరరై పొట్రు హిందీ రీమేక్‌గా ‘సరఫిరా’ విడుదలైంది.


తెలుగులో సూర్య హీరోగా ఇదే సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో డబ్బింగ్ రిలీజ్ చేశారు. తమిళంలో సుధా కొంగరా దర్శకత్వం వహించిన సూరరై పొట్ర సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమాకు కూడా సుధ కొంగారానే దర్శకురాలు. అయితే దక్షిణాదిన విజయవంతమైన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.

అయితే ‘సర్ ఫిరా’ సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడు థియేటర్ వరకు రావడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది ఇప్పుడు థియేటర్స్‌లో ఈ సినిమాకు పోటీగా అదే రోజు లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2 విడుదల కావడం. పైగా థియేటర్లలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD సినిమాకు ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతోంది.


Also Read: థాంక్యూ డార్లింగ్స్.. ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన వైజయంతి మూవీస్

ఇక రెండవది అక్షయ్ కుమార్ నటించిన గత 8 సినిమాలు ఫ్లాప్ కావడం. అక్షయ్ ఇంతకుముందు నటించిన బడే మియా ఛోటే మియా దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమాకు 350 కోట్లు ఖర్చు చేస్తే.. 60 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.

సర్ ఫిరా సినిమా చూసేందుకు థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేందుకు ప్రముఖ థియేటర్ గ్రూప్ అయిన పివిఆర్ ఐనాక్స్ వింత ఆఫర్ ప్రకటించింది. సర్ ఫిరా సినిమా టికెట్లు కొంటే ఓ కప్పు టీతో పాటు రెండు సమోసాలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు.. సినిమా ప్రొమోషన్స్ కోసం మర్చెండైజ్ కూడా ఇస్తారట.

Also Read: కల్కి మూవీపై హీరో సుమన్ షాకింగ్‌ కామెంట్స్‌, అందులో ఏముందంటూ..

ఈ ఆఫర్‌ను బట్టే తెలుస్తోంది. సినిమా చూడడానికి జనాలు రావడం లేదని. సర్ ఫిరా కలెక్షన్స్ గురించి మాట్లాడితే.. సినిమాకు మొదటిరోజు రూ.2.5 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు రూ.4.25కోట్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో కొంచెం మెరుగయ్యాయి. ఇక మూడోరోజు ఆదివారం కావడంతో రూ.5.25కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పటవరకు సినిమా మొత్తం కలెక్షన్స్ రూ.12 కోట్లకు చేరాయి. సర్ ఫిరా సినిమాలో అక్షయ్ కుమార్ సరసన హీరో భార్య పాత్రలో యంగ్ హీరోయిన్ రాధిక మదన్ నటించింది. సీనియర్ హిందీ నటుడు పరేష్ రావల్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించాడు.

‘సర్ ఫిరా’ కలెక్షన్స్ పుంజుకుంటాయని చెప్పడం కష్టంగా మారింది. ఇక అజయ్ దేవ్ గన్ హీరోగా త్వరలో విడుదల కాబోతున్న ‘సింగమ్ అగైన్’ సినిమాలో అక్షయ్ కుమర్ ప్రత్యేక పాత్ర పోషించారు.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×