E-Paper
Advertisement

వైసీపీని గెలిచిపించినా ఇక్కడకు వచ్చాం.. మీలో ఒకడిగా పుట్టలేదు.. మీలో ఒకడ్ని అయ్యా- డిప్యూటీ సీఎం పవన్

వైసీపీని గెలిచిపించినా ఇక్కడకు వచ్చాం.. మీలో ఒకడిగా పుట్టలేదు.. మీలో ఒకడ్ని అయ్యా- డిప్యూటీ సీఎం పవన్
Advertisement

Polavaram District: ఈ ప్రాంతంలో వైసీపీ ఎంపీని గెలిపించినా ఇక్కడకు వచ్చామని, గిరిజన ప్రాంతాలంటే తనకు మక్కువని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మీలో ఒకడిగా పుట్టలేదని, కానీ మీలో ఒకడ్ని అయ్యానని మనసులోని మాట బయపెట్టారు. ఈ గ్రామంలో 70 కుటుంబాలు ఉన్నాయని, దానివల్ల ఓట్లు రావని మీ సమస్యను పక్కన పెట్టలేదన్నారు. పట్టణాల కంటే గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ఖర్చు ఎక్కువైనా మీ సమస్య నా బాధ్యత అని భావించి ఇక్కడకు వచ్చానన్నారు.

పోలవరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన

ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయాలంటే.. పట్టణాల్లో ఖర్చు చేసినదానికంటే దాదాపు ఒకటిన్నర శాతం ఎక్కువ అవుతుందన్నారు. మీ గ్రామాల్లో రోడ్ల వల్ల ఓట్లు పడవని తాను చూసుకోలేదని, మీరు నా వాళ్లు అనుకుని చేస్తున్నానని వివరించారు.

అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం

Advertisement

ఈ సమస్య తనది అనుకుని భావించి వేగంగా పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రోడ్డు వేయడమంటే రెండు ఊళ్లు.. రెండు ప్రాంతాలను కలపడం కాదన్నారు. రోడ్లు లేకపోతే గ్రామం ఒంటరి అవుతుందని, దాన్ని నుంచి అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. అందుకే ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు ఉండాలన్నారు. రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు రోడ్లు ఉండాల్సిందేనన్నారు. మనుషులు రావడానికి బయటపడిన ఇలాంటి అడవుల్లో అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని, అదే తనకు స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు.

డబ్బులు లేకపోయినా అనుభవంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం-పవన్

గిరిజన సోదరులు ప్రకృతిని , సంస్కృతిని కాపాడుతారని అన్నారు డిప్యూటీ సీఎం. ఏడు దశాబ్దాలు అవుతున్నా, కొన్ని చోట్ల రహదారులు, విద్యుత్ సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలు వేరు.. నిజ జీవితం వేరన్నారు. 2018లో తనతో అరకు మహిళల మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. జన సైనికులు కండువానే ఆయుధంగా చేశారని, డబ్బులు లేకపోయినా కేవలం తన అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని నడుపుతున్నారని వివరించారు. కొన్నిచోట్ల గిరిజన గ్రామాల్లో మహిళల కాన్పు కోసం డోలీ మోతల మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Advertisement

ALSO READ: రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

Related News

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?

పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

Big Stories

Advertisement
×