E-Paper
Advertisement

ఈ దీపావళికి సన్‌ రూఫ్ కార్ కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపు 5 బెస్ట్ కార్లు ఇవే!

ఈ దీపావళికి సన్‌ రూఫ్ కార్ కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపు 5 బెస్ట్ కార్లు ఇవే!
Advertisement

Top 5 Sunroof Cars Under Rs 15 Lakh: దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.15 లక్షల లోపు ఉందా? అయితే, ఈ ఐదు కార్లును ఓసారి చెక్ చేయండి.

1.టాటా నెక్సాన్

టాటా నెక్సాన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ కావాలనుకునేవారికి ప్యూర్ ప్లస్ PS వేరియంట్ మంచి ఆప్షన్. ఇందులో రోజువారీ ప్రయాణాలకు అవసరమైన ఫీచర్లతో పాటు సన్‌రూఫ్ కూడా లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. డీజిల్ ఇంజిన్‌ను మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్లతో ఎంచుకోవచ్చు. CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫీచర్ కావాలనుకునేవారు ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.9.72 లక్షలు.

2.మహీంద్రా XUV 3XO

Advertisement

మహీంద్రా XUV 3XOలో REVX EDGE (O) వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్ కోరుకునేవారికి మరో బెస్ట్ ఆప్షన్. రూ.10 లక్షల లోపు ధరతో అందుబాటులో ఉన్న ఈ వేరియంట్‌ లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర: రూ.9.89 లక్షలు.

3.కియా సైరోస్

కియా సైరోస్‌లో HTK ప్లస్ వేరియంట్‌తో పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ కారు ఫీచర్లు, సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన అంశాలతో ఆకట్టుకుంటుంది. పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉండటంతో కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.76 లక్షలు.

4.ఎంజీ ఆస్టర్

Advertisement

ఎంజీ ఆస్టర్‌లో షైన్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉంది. కారు ఇంటీరియర్, సౌకర్యవంతమైన ఫీచర్లు  ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండగా, సేఫ్టీకి సంబంధించి రెండు ఎయిర్‌బ్యాగులే ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.11.34 లక్షలు.

5.టాటా కర్వ్

టాటా కర్వ్‌ లో క్రియేటివ్ X ప్లస్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో ఆకర్షిస్తోంది. స్టైలిష్ డిజైన్, ఇన్ఫోటైన్‌మెంట్, టెక్నాలజీ ఫీచర్లు, సేఫ్టీ ప్యాకేజీతో ఆకట్టుకుంటాయి. ఇందులో స్టాండర్డ్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, మరింత శక్తివంతమైన హైపెరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ వేరియంట్‌ లో ఉండదు. ఈ కారు ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.12.91 లక్షలు. రూ.15 లక్షల లోపు పనోరమిక్ సన్‌ రూఫ్‌ తో కారు కొనాలనుకునేవారికి ఈ ఐదు మోడల్స్ మంచి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు.

Read Also: లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

Tags

Related News

అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 కార్లు.. సెప్టెంబర్ లో నెంబర్ వన్ ఏదంటే?

దీపావళికి ఫ్యామిలీ కార్ కొనాలా? రూ.10 లక్షల లోపు 5 క్రేజీ సెవెన్ సీటర్ కార్లు ఇవే!

హైదరాబాద్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ.. ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే?

మారుతి సుజుకి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌ తో ఏకంగా 300 కి.మీ రేంజ్!

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×