E-Paper
Advertisement

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్
Advertisement

Visakhapatnam: బంగారం స్మగ్లర్లు రూటు మార్చారు. సరిహద్దుల్లో బలగాలు భారీగా మోహరించడంతో నేరుగా సిటీల మీదుగా తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ సిటీలో బంగారం సీజ్ చేశారు అధికారులు. దాదాపు 9 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బంగారం ఎక్కడి నుంచి వస్తోంది?

విశాఖ సిటీలో భారీగా బంగారం సీజ్

విశాఖ సిటీలో భారీ ఎత్తున బంగారం డీఆర్ఐ అధికారులు. గురువారం రాత్రి కోల్‌కతా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ కారును వెంబడించారు డీఆర్ఐ అధికారులు. ఎట్టకేలకు ఆ కారుని ఆపి మొత్తమంతా చెక్ చేశారు. అందులో దాదాపు రూ. 8.98 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్యాకెట్లుగా బంగారం ఉంది. 24-క్యారెట్ల మేలిమి బంగారం.

దాదాపు 9 కోట్ల రూపాయల విలువైన బంగారం సీజ్

Advertisement

కారులోని ముందు వైపు కూర్చొన్న సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రహ్య అరలో ఈ బంగారాన్ని దాచి పెట్టారు. బంగారం స్మగ్లింగ్ అవుతుందని అధికారులకు సమాచారం రావడంతో ప్రతీ వాహనాన్ని సోరాలు చేయడం మొదలుపెట్టారు. పట్టుబడిన బంగారం.. భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కోల్‌కత్తా టు హైదరాబాద్‌కు తరలింపు

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశం మేరకు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

ALSO READ: వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష

గడిచిన రెండు నెలల కిందట పలు దఫాలుగా బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. దీంతో ఆ ప్రాంతంలో ఓ వైపు కంచె నిర్మాణం, మరోవైపు భారీగా బలగాలు మోహరించారు. దీంతో స్మగ్లర్లు రూటు మార్చారు. సరిహద్దుల కంటే నేషనల్ హైవేలను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో కోల్ కత్తా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు. ఇంతకీ కోల్‌కత్తాలో ఆ బంగారం ఎవరి నుంచి తీసుకున్నారు? హైదరాబాద్‌లో ఎవరికి చేరవేయబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి డీఆర్ఐ అధికారుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో?

Related News

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?

పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×